Suryakumar Yadav: పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ సిద్ధం.. కొలంబో ఫ్లైట్ బుక్ అయింది!
- ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్
- సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
- పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించిన సూర్య.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్‌తో ఆడేందుకు నిరాకరించలేదని వెల్లడించాడు.
పాకిస్థాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఐసీసీ ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందన్న దానిపై ఆసక్తి పెరిగింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా.. శ్రీలంకతో కలిసి భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం వహిస్తోంది. భారత్–పాక్ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాలని ఐసీసీ ముందుగానే నిర్ణయించింది. ముంబైలో మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మా మైండ్‌సెట్ చాలా క్లియర్. మేము పాక్‌తో ఆడేందుకు ఎప్పుడూ నిరాకరించలేదు. పాక్ వైపు నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఫిక్చర్ ఇచ్చింది, ప్రభుత్వాలు న్యూట్రల్ వేదికను నిర్ణయించాయి. కొలంబోకి మా ఫ్లైట్ ఇప్పటికే బుక్ అయింది. మ్యాచ్ కోసం మేము వెళ్తాం కూడా. ఆ తర్వాత ఏమవుతుందో మా చేతుల్లో లేదు’ అని అన్నారు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ‘ఉస్తాద్’ సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తే.. పాక్ జట్టు రెండు పాయింట్లు కోల్పోయే అవకాశముంది. అయితే దీనికి మించి పీసీబీపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టత లేదు. పాకిస్థాన్‌పై బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఏ టీమ్ కూడా పాక్ వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే పీఎస్ఎస్ టోర్నీలో కూడా విదేశీ ప్లేయర్స్ ఆడకుండా కూడా ఐసీసీ బ్యాన్ చేయనుంది. మెగా టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఈ వివాదం చోటుచేసుకోవడంతో.. టీ20 వరల్డ్ కప్ 2026పై ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!