Clashes in Cockfighting: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు హుషారుగా సాగుతున్నాయి… ఎక్కడా తగ్గేదే లే … అన్న విధంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఓ వైపు కోడి పుంజులు కాలికి కత్తిగట్టి గాలిలోకి ఎగురుతున్నాయి… మరోవైపు పోట్లగిత్తలు రంకెలేస్తూ రయ్యి.. రయ్యిమంటూ కుమ్ముతున్నాయి. అయితే, కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందాల శిబిరం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కంకిపాడులో చలువాది రాజా ఆధ్వర్యంలో కోడి పందాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.. అక్కడ వణుకూరు – పునాదిపాడు కుర్రోళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. బీరు సీసాలతో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.. ఈ ఘటనలో కొందరు యువకుల తలలు కూడా పగిలాయి.. దీంతో, బాధితులను ఆసుపత్రికి తరలించారు.. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్టకేలకు రంగ ప్రవేశం చేశారు పోలీసులు.. కేవలం కోడి పందాల శిబిరాల వద్ద లైట్లు ఆపివేసి జనాల్ని తరిమికొట్టారు.. అయితే, ఇంత జరిగినా పేకాట శిబిరం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Mohan Bhagwat: రామమందిర ప్రతిష్ఠాపన రోజున భారత్కి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది..