Private Travels Bus Caught Fire: రన్నింగ్ బస్సు టైర్ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నరాయి.. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్ పేలడం కాకుండా.. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.. నంద్యాల శివారు చాపిరేవుల టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది.. బస్సు.. తిరువనంతపురం నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సు టైర్ నుండి మంటలు, వాసన వస్తుందని గమనించిన టోల్ గేట్ సిబ్బంది.. డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.. ఆ వెంటనే డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది..
తిరువన్నామలై నుండి హైదరాబాద్‌కు బస్సు తిరిగి వస్తుండగా.. నంద్యాల టోల్‌గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.. ఈ సమయంలో బస్సులో 30 నుండి 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. టైర్ బ్లాస్ట్ అయ్యి మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. మంటలను ముందుగానే గమనించిన డ్రైవర్ ప్రయాణికులను హుటాహుటిన కిందికి దించేశారు. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది.. టోల్‌గేట్ సిబ్బంది, డ్రైవర్ సకాలంలో స్పందించడంతో.. పండుగ పూట భారీ ప్రమాదం తప్పింది..