CM Chandrababu: నారావారిపల్లెలో బిజీబిజీగా సీఎం చంద్రబాబు
- ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్న సీఎం చంద్రబాబు..
- ఉదయం కులదైవం నాగాలమ్మ దర్శనం..
- సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళి..
- బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.
Read Also: YS Jagan London Trip: నేడు లండన్‌కు వైఎస్ జగన్ దంపతులు..
Also Read
ఇక, తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పండుగ సందర్భంగా ఆనందంగా గడుపుతున్నారు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు ఆటలపోటీలు నిర్వహించారు. చిన్నారులంతా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోనె సంచి రేసు, భుజం నెట్టడం, మ్యూజికల్ ఛైర్, బెలూన్ బ్లాస్టింగ్ లాంటి పోటీల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. 2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమిపూజ చేశారు. నారావారిపల్లెలో 3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరకులు అందనున్నాయి. నారావారిపల్లెలో మహిళలకు చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!