Narendra Modi Vizag Tour Live Updates : ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఎయిర్‌పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ…
రోజు మరో సెల్ ఫోన్ గుర్తించారు జైల్ అధికారులు.. నెల రోజుల వ్యవధిలో ఆరు సెల్ ఫోన్లు లభ్యం కావడంపై దృష్టిసారించారు అధికారులు.. హోం మంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును పరిశీలించిన మూడు రోజులలో మరో సెల్ ఫోన్ అధికారులకు దొరకడం చర్చగా మారింది.. ఇక, సెల్‌ఫోన్‌ను గుర్తించిన జైలు అధికారులు.
కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం అని హామీ ఇచ్చారు.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి.. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు..
సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్‌లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు.. బయట నుంచి ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కోవడానికి కౌంటర్ యాక్షన్ బృందాలు సిద్ధంగా ఉండనున్నాయి.. NSG, ఎస్ఎస్జీ, స్థానిక…
సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చెంజర్, 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజు 1 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600, మహారాజ్ బెన్ఫిట్ షోస్ కు రూ. 500 పెంచుకునేలా ఉత్తర్వులు…
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోంది.. ఇంటర్ విద్య లో కీలక మార్పులు వస్తాయి.. పాఠ్య పుస్తకాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.. ఇక మొదటి సంవత్సరం ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న నిబంధనకు మినహాయింపు ఇవ్వబోతున్నారు.
ఆంధ్ర, తెలంగాణతో పాటు 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు నిర్వహిస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిక అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు జరుగుతున్నాయి. హన్సిక, అనిల్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడ్డారు. 12 ప్రాంతాల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుని వాడుకున్నారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తామంటూ పలు…
మోడీ పర్యటనలో రోడ్డు షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. సుమారు లక్షమంది తో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది.. ఓపెన్ టాప్ వెహికల్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు.
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.