థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో 'జన నాయకుడు' వెబ్‌సైట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. ఇక, ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీకి స్వాగతం పలికి.. ఆ తర్వాత రోడ్‌షోలో పాల్గొనబోతున్నారు..
ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు..
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. విశాఖలో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్ల్ నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేశారు టీటీడీ అధికారులు..
సంచలనం సృష్టించిన ముంబై సినీనటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. ఈ కేసులో ఐపీఎస్ అధికారులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. కా
రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది.
నందలూరు మండల కేంద్రంలో కిక్రెట్ ఆడుతుండగా.. యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఇది చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా అనే కువకుడిపై దాడి చేశారు 11 మంది యువకులు.. అతడిని చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కావడంతో.. 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు..