* నేడు ముంబైలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. అధునాతన యుద్ధనౌకలు.. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. ఇస్కాన్ టెంపుల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
* నేడు మథురాలో కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ..
* నేడు ఢిల్లీలో ఏఐసీసీ కొత్త భవనం ప్రారంభోత్సవం.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, రాజనర్సింహ
* ఢిల్లీ: నేడు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో SLP వేసిన కేటీఆర్.. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని హైకోర్టును కోరిన కేటీఆర్.. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన కేటీఆర్
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతి కొనసాగుతున్న వైకంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. రోజుకి 55 వేల దర్శన టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ.. ప్రస్తుతం ఎల్లుండికి సంబంధించిన టోకెన్లు జారీ.
* తిరుమల: ఇవాళ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం.. ధనుర్మాసం కారణంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వ తేదీ వరకు సుప్రభాత సేవను నిలిపివేసిన టీటీడీ.
* శ్రీ సత్యసాయి : స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకల్లో భాగంగా.. కదిరిలోని యస్.టి.యస్.ఎన్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ . ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం.. మధ్యాహ్నం 12 గంటలకు పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం.. సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ప్రణయ కలహ మహోత్సవం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.
* నేడు గుంటూరు జిల్లా ఎస్పీని కలవనున్న వైసీపీ ముఖ్య నాయకులు.. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న నాయకులు.. కార్యాలయంపై దాడి చేసి పలువురుని గాయపరిచిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ ముఖ్య నాయకులు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తదితరులు..
* డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమలో ప్రభల ఉత్సవం.. జగ్గన్నతోటలో ప్రభల తీర్థంకు భారీ ఏర్పాట్లు.. అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల నుండి జగ్గన్నతోటకు రానున్న ప్రభల ఊరేగింపులు.. అంబాజీపేట మండలంలో ఏకాదశ రుద్రులు కొలువైన పదకొండు గ్రామాలలో ప్రభల ఊరేగింపులు
* తిరుపతి: టీటీడీ ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం…ఉ.8 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
* తిరుపతి: నేడు చంద్రగిరి కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశం..
* తిరుపతి: నేడు బొప్పరాజుపల్లి, రంగంపేట, పుల్లయ్యగారి పల్లి గ్రామాల్లో జల్లికట్టు వేడుకలు…
* నంద్యాల: బనగానపల్లెలో రూ.30.66 కోట్ల వ్యయంతో జుర్రేరు వాగు అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు నేడు భూమి పూజ చేయనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
* కర్నూలు: మంత్రాలయం మండలం రాంపురం లో నేడు శ్రీ రామలింగేశ్వరిస్వామి స్వామి మహా రథోత్సవం.
* నంద్యాల: నేడు పగిడ్యాల మం ప్రాతకోటలో శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర, శ్రీ గంగా పార్వతి నాగేశ్వర స్వామి దేవాలయాల్లో రథోత్సవం..
* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78000 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17406 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు
* ఏపీలో నేడు బ్యాంక్‌లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. బ్యాంక్ యూనియన్లు కోరడంతో కనుమ రోజు సాదారణ సెలవుగా ప్రకటించిన సర్కార్
* హైదరాబాద్: పరేడ్‌గ్రౌండ్స్‌లో నేటితో ముగియనున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. పాల్గొన్న 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్, దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్
* నంద్యాల: నేడు ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ప్రారంభం కానున్న పారువేట ఉత్సవాలు… 45 రోజులపాటు 33 గ్రామాలలో నిర్వహించనున్న పారువేట ఉత్సవాలు… నేడు కొండ దిగి అహోబిలం నుండి బాచేపల్లి బయలుదేరనున్న అహోబిలేశ్వరుడు..