Cockfighting: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచిన ఓడిన కోడిపుంజుకున్నా డిమాండే వేరు. ఓడిపోయిన కోడి కోస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ఫ్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు.. గనుక వీటి మాంసం టేస్టే వేరు.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లుకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు. ఇక, ఏనుగు చచ్చిన బతికిన వేయ అన్నట్టుగా పందెం పుంజు పరిస్థితి తయారయింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే కోడిపందాల బరిలో గెలిచిన పుంజు పందెం రాయుళ్లను సంతోష పెడుతుంటే.. ఓడిన పుంజు భోజన ప్రియుల మనసు గెలుచుకుంటుంది.
Read Also: Mani Sharma: సురేష్ కొండేటి “అభిమాని” సినిమాకి మణిశర్మ రీ – రికార్డింగ్
ఏడాదంతా పందెం కోసం బలమైన ఆహారం పెట్టిమరీ పెంచిన పుంజు కావడంతో రుచిలో అమోఘంగా ఉంటుంది. అందుకే ఓడిన పుంజును కొని అతిధులకు విందుగా ఇచ్చేందుకు జిల్లా వాసులు ఎక్కువ ఆసక్తి చూపడంతో కోస ధర కొండెక్కి కూర్చుంది.. సంక్రాంతి సంబరాల్లో కీలకంగా నిలిచే కోడిపందాల బరుల వద్ద నాన్ వెజ్ వంటకాలు జనానికి నోరూరిస్తున్నాయి. కోడిపందాలు చూసేందుకు వేల సంఖ్యలో తరలి వచ్చే అతిధులు అంతా పందెం బరుల వద్ద దొరికే చికెన్ మటన్ పకోడీల కోసం క్యూ కడుతున్నారు. ఒక్కో బరి వద్ద తయారు చేస్తున్న వందల కేజీల చికెన్, మటన్ వంటకాలతో ఆ ప్రాంతమంతా ఘమ ఘుమలు వెదజలుతున్నాయి. గోదావరి రుచులతో కలగలిపిన వంటకాలు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు వాటిని రుచి చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పందెంలో ఓడిపోయిన పుంజే కదా.. అని చీప్‌గా తీసేయకండి.. అది ఓడిపోయిన పుంజు అయినా.. ఒక్కటి 10 వేల రూపాయల వరకు పలుకుతుందంటే.. దానికి ఉన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు..