కోనసీమను మించేలా పులివెందులలో మొట్టమొదటిసారిగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తాము కూడా తగ్గేదేలే అంటూ బరులు గీసి పందాలకు తెర లేపారు అక్కడి రాజకీయ నేతలు… మొట్టమొదటిసారిగా పులివెందుల చరిత్రలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోనసీమకు తామేమి తీసుకోమని టెంట్లు వేసి బరులు గీసి జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇదే తంతు కొనసాగుతోంది. ఇంత జరుగుతున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు కోనసీమ జిల్లాల్లో జరిగే కోడి పందాల శిబిరాల్లో మహిళలు అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. పందాలకు సై అంటున్నారు. తగ్గేదే లేదంటూ లక్షల్లో పందాలు కడుతున్నారు. పందెం రాయుళ్లుతో సమానంగా కోడిపందాలు చూడటానికి వచ్చిన మహిళల్లో ఎక్కువ మందే పందాలు వేస్తున్నారు.
Read Also: Software Engineers: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డేంజర్ బెల్స్.. జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు..
అచ్చతెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఎన్నో పండుగల్లో.. ప్రధానమైన పండుగ సంక్రాంతి. తెలుగుదనం ప్రతిబింబించేలా జరిగే ఈ పండుగ… మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సంక్రాంతిలో అత్యంత విశిష్టమైనది పతంగుల పండుగ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలు ఎగుర వేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగులు పోటీలను నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా పతంగులు పోటీలో పాల్గొని గాలిపటాలు ఎగురవేస్తున్నారు.
Read Also: Buddha Venkanna: రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి.. బుద్ధా వెంకన్న సవాల్