సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్నారు అతిధులు. పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందాలను చూస్తూ చిన్న పెద్ద అంతా ఆనందంగా గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులంతా పండుగ వాతావరణం ఆస్వాదిస్తున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కోడిపందాల బరుల వద్ద ఏర్పాటుచేసిన పేకాట, గుండాట వంటి ఆటల దగ్గర జనం పెద్ద ఎత్తున చేరుకుని పందాలు కాస్తున్నారు. మగాళ్ళ కంటే మేము తక్కువ కాదు అన్నట్లు యువతులు సరదాగా పందాలు కాస్తూ సందడి చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగ సందడిలో భాగమవుతున్నారు.
Read Also: Bengaluru: బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. కాంక్రీట్ నిర్మాణాల పరిశీలనకు ఏఐ ఉపయోగించాలని నిర్ణయం
రెండో రోజు కూడా ఏపీలో పందెం రాయుళ్లు బరుల్లో తమ ప్రతాపం చూపిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడిలో పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేశారు. దీంతో నగరవాసులందరూ ఈ బరుల దగ్గరకు వెళ్లి సంక్రాంతి పండుగ వేడుకలను కోడిపందాలను చూస్తుండటంతో.. బరులు కిటకిట లాడుతున్నాయి. లక్షల రూపాయలు ఒక్కో పందానికి చేతులు మారుతున్నాయి.
Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు