Buddha Venkanna: రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి.. బుద్ధా వెంకన్న సవాల్
- రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ బుద్దా వెంకన్న సవాల్
- రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా- బుద్ధా వెంకన్న
- దమ్ముంటే రేపు నాపై దాడి చేయండి..- బుద్ధా వెంకన్న
- గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో..,
- మాపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేసాం- బుద్ధా వెంకన్న.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తాను, బోండా ఉమా మాచర్ల వెళ్ళామని చెప్పారు.
Read Also: Hyderabad: పట్నంలో పల్లెటూరి వాతావరణం.. ఘనంగా సంక్రాంతి వేడుకలు..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
ఆ సందర్భంలో పిన్నెల్లి సోదరులు.. వేలంపాట పెట్టి వచ్చిన వారిని ఎవరు చంపుతారు, వారికి లైఫ్ సెటిల్మెంట్ అని పిలుపునిచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. వేలం పాటలో తురకా కిషోర్ అనే వ్యక్తి తమను చంపేందుకు ముందు వచ్చాడని అన్నారు. వెదురు బొంగుతో తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.. తమ నాయకుడు ధైర్యంతో, దేవుడి ఆశీస్సులతో తాము బయట పడ్డామని బుద్ధా వెంకన్న తెలిపారు. తమపై దాడిలో పాల్గొన్నది తురకా కిషోర్ అయితే.. దాడి చేయించింది పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసుని ఎవరు పట్టించుకోలేదని చెప్పారు.
Read Also: Bullet Bike: బుల్లెట్ బైక్ అమ్మేశారని బాలుడు ఆత్మహత్య..
ఇప్పుడు ఉన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎంతో నిజాయితీపరుడు.. తురకా కిషోర్ ని అరెస్ట్ చేయడంలో ఎస్పీ కీలక పాత్ర పోషించారని బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు తప్పించుకునేందుకు హై కోర్టులో ముందస్తు పిటిషన్ వేశారన్నారు. మీరు ఆషామాషీ వ్యక్తులతో పెట్టుకోలేదు.. బుద్దా వెంకన్న లాంటి వ్యక్తితో పెట్టుకున్నారని అన్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.. మీకు శిక్షలు పడే వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు. పిన్నెల్లి పై హైకోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయబోతున్నాను.. ముందస్తు బెయిల్‌ను రద్దుచేసే విధంగా పోరాడతానని బుద్ధా వెంకన్న తెలిపారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!