రాజకీయ కురువృద్ధుడు పాలవలస రాజశేఖర్ (78) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.
ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. చింతపల్లి ఏఎస్పీగా 2021 బ్యాచ్కు చెందిన నవ జ్యోతి మిశ్రాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే.. నంద్యాల ఏఎస్పీగా 2022 బ్యాచ్కు చెందిన మందా జావళి అల్ఫోన్ను నియమించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో రోజు సెలవుగా ప్రకటించింది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 73 జారీ చేశారు. అయితే, కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేయగా.. దీంతో, కనుమ రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేశారు..
మూడు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. ఒక కిలోమీటరు డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా , జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవ పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పండగ సందడిలో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.. పల్లె సౌభాగ్యమే... దేశ సౌభాగ్యం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.
తిరుపతి ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీటీడీపై రకరకాల పోస్టులు పెడుతున్నారు.. అయితే, సోషల్ మీడియాలో టీటీడీపై తప్పువు వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు టీటీడీ చైర్మన్..
నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి ఫ్యామిలీలో హుషారుగా పాల్గొంటున్నాయి.. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. ఇక, మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి .. అంతేకాదు.. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు సీఎం దంపతులు.. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ సహా పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకు రావాల్సిన బిల్లులకు సంబంధించి కొంతకాలంగా ఒత్తిడి వస్తోంది.. పలు వర్గాలకు గత కొంత కాలంలో పెండింగ్ లో ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది.. .దాదాపు 8 ఏళ్లుగా కూడా కొన్ని బిల్లులు చెల్లింపులు జగన్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది.. అలా పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్లు రుపాయిలు నిధులు విడుదల చేశారు..