Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్ అయిన హీరో సూర్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో స్టైలిష్ మేకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్‌గా వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య, తన కెరీర్ ఎదుగుదలకు కారణమైన దర్శకుడిని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. సూర్య స్టేజీపైకి వస్తూనే గౌతమ్ మీనన్‌తో కలిసి ‘అంజల’ పాటకు స్టెప్పులేయడం చూసి ఫ్యాన్స్ కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
Also Read : TV Actress Vahini : క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ నటి వాహిని మృతి..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘సినిమాకు దర్శకులే బ్రహ్మలు. వాళ్ళు ఒక పాత్రను ఊహించకపోతే మాలాంటి నటులకు అస్సలు గుర్తింపు ఉండదు. ఒక నటుడిగా నన్ను మలిచిన వ్యక్తి గౌతమ్ మీనన్. ఈ రోజు సమాజంలో నాకు దొరుకుతున్న గౌరవానికి, అభిమానుల ప్రేమిస్తున్న ‘అన్బుసెల్వన్’ పాత్రకు మూలం ఆయనే. ‘కాక్క కాక్క’ సినిమా నా కెరీర్‌నే మలుపు తిప్పింది’ అని కొనియాడారు. కేవలం సినిమా కోసమే కాకుండా వ్యక్తిగతంగా కూడా గౌతమ్ మీనన్ తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఆయన సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సూర్య భావోద్వేగంగా చెప్పారు.
సూర్య తన ప్రసంగం ముగిస్తూ, ఇన్నేళ్లుగా తనకు అండగా నిలుస్తున్న అభిమానులకు తలవంచి నమస్కరించారు. ఈ హిట్ కాంబో మళ్ళీ ఎప్పుడు కలుస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, తన మూలాలను గుర్తుంచుకుని దర్శకుడికి ఇచ్చిన ఈ గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది.
#Suriya dance to Anjala song with GVM and Karthik@Suriya_offl pic.twitter.com/iXnPRWQZhe
— Suresh PRO (@SureshPRO_) February 5, 2026
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!