Minister Nara Lokesh: దావోస్ పర్యటలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఫిలిప్ మోరిస్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన ఆయన.. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు.. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు.. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు.. జెడ్ ఎఫ్ ఫాక్స్‌కాన్ సీఈవోతో సమావేశమయ్యారు లోకేష్.. సప్లయ్ చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ అనుకూలమని వివరించారు.. ఏపీలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు మంత్రి లోకేష్..
Read Also: Salary Accounts: శాలరీ అకౌంట్ ఉందా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రపంచంలో నెం.1 టొబాకో ఉత్పత్తుల సంస్థ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ చైర్ పర్సన్ ఆండ్రియా గోంట్కోవికోవాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఫిలిప్ మోరిస్ అనుబంధ సంస్థ అయిన గాడ్ ఫ్రే ఫిలిప్స్ ద్వారా ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు.. దేశంలో 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ ఏర్పాట్లపై చర్చించారు. ఇందుకు గుంటూరు, పరిసర ప్రాంతాలు అనువుగా ఉంటాయన్నారు.. వ్యూహాత్మక విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అనుకూల ప్రాంతమని. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున పొగాకు పంట సాగుచేస్తున్నారన్నారు.. ఉత్పాదక కార్యకలాపాల కోసం అవసరమైన శ్రామికశక్తి ఏపీలో అందుబాటులో ఉందని వివరించారు లోకేష్… సప్లయ్ చైన్ కార్యకలాపాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతోపాటు గుంటూరులో ఉన్న టొబాకో బోర్డు, పొగాకు రైతుల నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతాయని వివరించారు.. ఆంధ్రప్రదేశ్ 27 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మిగులు విద్యుత్ ఉందన్నారు.. 1054 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, ఆరు ఆపరేషనల్ పోర్టులు కలిగి మారిటైమ్ ట్రేడ్ కు అనుకూల వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు లోకేష్..
Read Also: Turkey: టర్కీలో ఘోర అగ్నిప్రమాదం.. 66 మంది మృతి
దావోస్ బెల్వెడేర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు లోకేష్. ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా పరివర్తన కోసం 2030 నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. 2030 నాటికి ఈ రంగంలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి.. 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని వెల్లడించారు. డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్‌మార్క్ ని సెట్ చేస్తూ సస్టయినబుల్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఏపీలో 5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్ (IRESP)ని కలిగి ఉందని వివరించారు మంత్రి నారా లోకేష్..
Read Also: Kamala Harris: కమలా హారిస్ ఫ్యూచర్ ఫ్లాన్ ఇదేనా? 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారంటే..!
ఇక, దావోస్ లోని బెల్వేడార్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమయ్యాను. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్, భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటుచేయాలని కోరినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు లోకేష్.. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపాను. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీమిట్టల్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాను. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీ మిట్టల్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఏపీ ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారని ట్వీట్ చేశారు.
I met Andrea Gontkovikova, Vice Chairperson for Southeast Asia at Philip Morris International, at Davos Belvedere. I seized the opportunity to invite Philip Morris International to establish a smoke-free cigarette manufacturing unit in Andhra Pradesh, leveraging the state's… pic.twitter.com/1mUAJ7GVRB
— Lokesh Nara (@naralokesh) January 21, 2025
I have participated in a roundtable at the World Economic Forum, Davos, on ‘Environmental Conservation – The Future of the Climate Movement.' Clean energy is the only way to tackle rising temperatures. It is estimated that Global climate goals need a $4T investment by 2030.… pic.twitter.com/aHIKuNQG3W
— Lokesh Nara (@naralokesh) January 21, 2025
I had an insightful meeting with Mr. @RajaRajamannar, Chief Marketing & Communications Officer and Founding President – Healthcare Business, Mastercard, at the Davos Belvedere during #WEF2025. I presented the immense potential of Andhra Pradesh's talent pool and proposed the… pic.twitter.com/Tj2uTTyUEb
— Lokesh Nara (@naralokesh) January 21, 2025