సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.. వెంకటాపురం గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాకు.. ఆ తర్వాత మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్గా మారిపోయాయి.. సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ సైకిల్ గుర్తు, కారు…
నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు. అంబాజీపేట మండలంలో ఏకాదశ రుద్రులు కొలువైన పదకొండు గ్రామాలలో ప్రభల ఊరేగింపులు కొనసాగనున్నాయి.. ఈ నేపథ్యంలో పి. గన్నవరం సీఐ భీమరాజు ఆద్వర్యంలో ప్రభల తీర్ధాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్నారు అతిధులు. పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందాలను చూస్తూ చిన్న పెద్ద అంతా ఆనందంగా గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులంతా పండుగ వాతావరణం ఆస్వాదిస్తున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమను మించేలా పులివెందులలో మొట్టమొదటిసారిగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తాము కూడా తగ్గేదేలే అంటూ బరులు గీసి పందాలకు తెర లేపారు అక్కడి రాజకీయ నేతలు... మొట్టమొదటిసారిగా పులివెందుల చరిత్రలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోనసీమకు తామేమి తీసుకోమని టెంట్లు వేసి బరులు గీసి జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు.
నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచిన ఓడిన కోడిపుంజుకున్నా డిమాండే వేరు. ఓడిపోయిన కోడి కోస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ఫ్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు.. గనుక వీటి మాంసం టేస్టే వేరు.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లుకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు.