శ్రీశైలం మల్లన్న ఆలయంలో ధనుర్మాసంలో వచ్చిన ఆరుద్రా నక్షత్రం సందర్భంగా శ్రీస్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు.. ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహించడం దేవస్థానానికి ఆనవాయితీగా వస్తుంది. నిన్నరాత్రి శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించి..
గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.. ''రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు అనుకూలం అనే తీర్మానాన్ని 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో పెట్టించాలని చూసిందని పేర్కొన్నారు.. 2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరిగాల్సింది ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. ఆ దుకాణంలో దొంగతనం తీరు వ్యాపారులనే కాదు స్థానికులను సైతం భయపడే విధంగా ఉంది. షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో ఇది గమనించిన దొంగలు గోడకి కన్నం వేసి ఉన్నదంతా దోచేశారు..
తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా…
Bhogi Festival: తెలుగు ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి.. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఈ పండుగను నాలుగు రోజుల పాటు చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుతారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.