AP Liquor Shops: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ
- గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయింపు..
- నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
- జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లకు ఎంపిక..
- ఒక షాపుకి ఫీజు రూ. 2 లక్షల నాన్ - రిఫండబుల్ మొత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది.. అందులో భాగంగా గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, గీత కార్మికులకు 335 మద్యం షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లకు ఎంపిక చేయనున్నారు.. అభ్యర్థులు తమ కుల, నేటివిటీ ధ్రువపత్రాలు సమర్పించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఒక షాపుకి ఫీజు 2 లక్షల రూపాయల నాన్ – రిఫండబుల్ మొత్తాన్ని నిర్ణయించారు.. ఒక అభ్యర్థి ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది.. కానీ, ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.. ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. ఇక, రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..
Read Also: Somireddy Chandramohan Reddy: అర్హులైన వారికి ఇంటి స్థలాలు.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు..
Also Read
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేసింది ప్రభుత్వం.. అందులో 10శాతం ఇప్పుడు గీత కులాలకు కేటాయించనున్నారు.. అలా వచ్చే 340 షాపుల్లో నాలుగు షాపులు సొండి కులానికి విడిగా కేటాయిస్తారు. గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కుటుంబానికి ఒక షాపును కేటాయించనున్నారు. మిగిలిన 335 షాపులకు నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇక, తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు గీత కులాలకు కేటాయించారు. అల్లూరి సీతారామరాజు-1, అనంతపురం-14, శ్రీసత్యసాయి-9, అన్నమయ్య-11, చిత్తూరు-10, తూర్పు గోదావరి-13, కాకినాడ-16, కోనసీమ-13, బాపట్ల-12, గుంటూరు-13, పల్నాడు-13, కడప-14, కృష్ణా-12, ఎన్టీఆర్-11, కర్నూలు-10, నంద్యాల-11, నెల్లూరు-18, ప్రకాశం-18, పార్వతీపురం మన్యం-4, శ్రీకాకుళం-18, అనకాపల్లి-15, విశాఖపట్నం-14, విజయనగరం-16, ఏలూరు-14, పశ్చిమగోదావరి-18 షాపులు గీత కార్మికులకు కుటుంబాలకు కేటాయించింది ప్రభుత్వం..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..