CM Chandrababu: దావోస్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దావోస్ సీఐఐ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు.. పెట్టుబడుల అంశంపై మాట్లాడిన ఆయన.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారన్నారు… మూడో సారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని.. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది… కానీ, భారతదేశంలో లేదన్నారు. పరిపాలనలో ఒక స్పష్టతతో ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. GDP వృద్ధి రేటులో భారతదేశం అగ్రగామిగా ఉందని, ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేస్తామనే నమ్మకం ఉందన్నారు..
Read Also: Donald Trump: భారతీయులకు ట్రంప్ షాక్.. యూఎస్ నుంచి 18,000 మంది బహిష్కరణ..!
2028 నుంచి భారత యుగం ప్రారంభమవుతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. భారతదేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్‌గా చేసేందుకే ‘వికసిత్ భారత్ 2047’ ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ తొలి రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న 10 మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేస్తున్నామని, కాకినాడ వంటి పటిష్టమైన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ రూపకల్పనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మార్గనిర్దేశాన్ని మరిచిపోలేమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..