ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరగాల్సిన గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలపై అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఎపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరపాలని ఎపీపీఎస్సీ నిర్ణయించింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్ లో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు. మెయిన్స్ ప్రశ్నా పత్రాన్ని ట్యాబ్ లలో పొందుపరిచి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.
కాగా ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ లో రెండు క్వాలిఫైయింగ్ పేపర్లతో పాటు ఐదు మెరిట్ పేపర్లతో కలిపి మొత్తం 7 పేపర్లకు పరీక్ష ఉంటుంది. గతేడాది మార్చి 17వ తేదీన ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ అయ్యాయి.
ఏయే తేదీల్లో ఎగ్జామ్స్ జరుగనున్నాయంటే..