Minister Savitha: కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఎక్కడికెళ్లినా సమస్యలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగింది.. గతంలో పులివెందులకు నీళ్లు లేని పరిస్థితి ఉండేది.. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నీటి ప్రాజెక్టుల పనులు ఇప్పుడు చేపడుతున్నాం.. భూ కబ్జాలు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టం అని తేల్చి చెప్పారు. భూకబ్జాలపై టాస్క్ ఫోర్స్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉంది సమీక్షించి సమస్య లేకుండా చేస్తాం.. పాఠశాలలను కబ్జా చేసి వాటర్ ప్లాంట్లను నిర్మించి.. వాటిని తొలగిస్తామన్నారు. అన్ని సమస్యలపై జిల్లా రివ్యూ మీటింగ్ లో చర్చించాం అని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఇక, ఎమ్మెల్యేలు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకు వచ్చారని మంత్రి సవిత చెప్పారు. వాటిని దశల వారీగా పరిష్కరించుకుంటూ వస్తాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది.. చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.