వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.. అనారోగ్యంగా కారణంగా.. ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను.. వైద్యులు డిశ్చార్జ్ చేయగానే వస్తాను.. అయితే, నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని.. ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం..
తిరుపతి తొక్కిసలాట.. ముగిసిన తొలిదశ న్యాయ విచారణ..
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్ర కలకలం రేపింది.. అయితే, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ తొలిదశ ముగిసింది.. నిన్న న్యాయ విచారణ కమిషన్ ముందు కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడో రోజు హాజరయ్యారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.. పద్మావతి పార్కులో ఎంత మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది.. లోపలికి ఎంతమందిని పంపారని కలెక్టర్ వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటివరకు టీటీడీ దర్శన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవడం లేదని కలెక్టర్ తెలపగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండటానికి చొరవ చూపాలని కమిషన్ సూచించినట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనకు ముందు.. తర్వాత పలు శాఖలకు ఇచ్చిన సూచనలు, ఆదేశాల గురించి సీవీఎస్ఓ వివరించారు. క్యూలైన్ల నిర్వహణలో విజిలెన్స్ విభాగం తీసుకున్న చర్యలు.. భవిష్యత్తులో పాటించాల్సిన భద్రతా చర్యల వివరాలు త్వరలో అందజేస్తామని సీవీఎస్ఓ గడువు కోరినట్లు సమాచారం.
నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఎమ్మెల్యేగా తాను సూచించిన కౌన్సిలర్ సత్యవతి పేరు పై బీఫామ్ వస్తుందని ఆశించారు తంగిరాల సౌమ్య.. అయితే, ఎమ్మెల్యే సౌమ్యకు మరోసారి షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. ఎమ్మెల్యే సూచించిన పేరు.. ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్యే మార్గంగా పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి పేరు మీద బీఫామ్ అధిష్టానం పంపడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.. కౌన్సిలర్లను తీసుకొని నేరుగా ఎన్నిక జరిగే జగజ్జీవన్ రామ్ భవనంకు చేరుకున్నారు.. బీఫామ్ లేకుండా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతితో నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి కౌన్సిలర్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని.. బీఫామ్ లేదు కాబట్టి ఇండిపెండెంట్‌గా సత్యవతి చైర్మన్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..మరోవైపు.. మంత్రి నారాయణ నుండి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఫోన్ వచ్చిందట.. ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన అభ్యర్థి కాకుండా అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని స్పష్టం చేశారట మంత్రి నారాయణ.. దీంతో.. పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూల్ అయినట్టుగా తెలుస్తోంది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మధ్యే మార్గంగా అధిష్టానం సూచించిన పదో వార్డు కౌన్సిలర్ కృష్ణ కుమారికి మద్దతు తెలపాలని అధిష్టానం ఎమ్మెల్యేకు సూచించడంతో.. ఆ వెంటనే ఆమెకు మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యే సౌమ్య.. అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మంత్రి నారాయణకు తెలిపారట ఎమ్మెల్యే సౌమ్య.. దీంతో.. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు, ఒక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఏపీ ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి.. ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఎన్నిలక కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఫిబ్రవరి 13న నామినేషన్లు ఉపసంహరణకు గడువుగా పెట్టింది ఎన్నికల కమిషన్.. ఇక, ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వివేక్ యాదవ్ నోటిఫికేషన్ జారీ చేశారు.. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే ప్రధాన పార్టీలో ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.. అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించిన విషయం విదితమే..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర.. కూటమిదే విజయం..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. విజయం మీదా..? మాదా? అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టును తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకుంది.. నగర డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినే గెలుపు వరించింది.. డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు కూటమి అభ్యర్థి ఆర్‌సీ మునికృష్ణా .. కూటమి అభ్యర్ది ఆర్‌సీ మునికృష్ణాకు మద్దతుగా చేతులెత్తారు 26 మంది కార్పొరేటర్లు.. మరోవైపు.. ఎలాగైనా తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు.. దీంతో.. కూటమి అభ్యర్థి ఆర్‌సీ మునికృష్ణా విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు..
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం.. లండన్ పర్యటన తర్వాత తొలి భేటీ..
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు.. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం.. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై జగన్ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు.. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.. ఇటీవల పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా వంటి అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.. వీటితో పాటు పలు కీలక అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు జగన్.. కాగా, ఈ మధ్యే లండన్ పర్యటనకు వెళ్లివచ్చారు జగన్.. లండన్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిన ఆయన.. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి ఏపీకి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.. ఇక, ఆ తర్వాత తాడేపల్లి ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎండీ, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. అక్కడ కూడా జగన్ కాన్వాయ్‌పై పువ్వుల వర్షం కురిపించారు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు..
ప్రభుత్వ నిర్లక్ష్యం 8వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారింది
తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే హృదయం కలచివేస్తుందని ఆయన పేర్కొన్నారు. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రభుత్వ ఆరోగ్య భద్రత కార్డుతో ఆసుపత్రికి వెళ్లినా, ఆ కార్డు చెల్లుబాటు కావడం లేదని వైద్యసేవలు అందడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీస్ ఉద్యోగికి శాపంగా మారిందని ఆయన అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే, ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ నోటీసులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ నోటీసులు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనితో ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చే ముందు, వారు తాము చేపట్టనున్న కార్యాచరణపై కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగింది
తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సర్వేను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిర్వహించిందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. అయితే, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కావాలని సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో సర్వే అధికారులపై కొందరు కావాలని కుక్కలు వదిలారని ఆయన తెలిపారు. కుల గణన సర్వేపై అనవసర అపోహలు పుట్టించవద్దని పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీలను మరింత బలపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీల గురించి ఎవరు మాట్లాడినా, వారిని చులకన చేయొద్దని తెలిపారు. తమ ప్రభుత్వానికి బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లేదని, ఏ పని చేసినా పూర్తి చిత్తశుద్ధితో చేస్తామన్నారు.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఏకంగా రూ. 1050 పెరిగిన పసిడి ధర
హమ్మయ్య బంగారం ధరలు తగ్గాయి అని అనుకునే లోపే మళ్లీ షాకిచ్చాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. పసిడి ప్రియులకు ఊహించని షాకిస్తున్నాయి గోల్డ్ ధరలు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. వంద, రెండు వందలు కాదు ఏకంగా తులం బంగారంపై రూ. 1050 పెరిగింది. ఒక్కరోజులోనే రూ. వెయ్యికి పైగా ధర పెరగడంతో గోల్డ్ లవర్స్ ఉసూరుమంటున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,810, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,520 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 1050 పెరగడంతో రూ. 78,100 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 పెరిగడంతో రూ. 85,200 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,100 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 85,200 వద్దకు చేరింది. హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78250 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85350 వద్ద అమ్ముడవుతోంది. బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. నేడు కిలో వెండిపై ఏకంగా రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో వెండి ధర గ్రాము రూ. 106, కిలో రూ. 1,06,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. వెయ్యి తగ్గడంతో రూ. 98500 వద్ద అమ్ముడవుతోంది.
పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐకూ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టన్నింగ్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్స్ తో, మిడ్ రేంజ్ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకురాబోతోంది. iQOO త్వరలో భారత మార్కెట్లో నియో 10R ను విడుదల చేయనుంది. అయితే ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6400mAh బ్యాటరీ, 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫోన్ యొక్క ప్రధాన లెన్స్ 50MP సోనీ LYT-600 సెన్సార్ ను కలిగి ఉంటుంది. దీనికి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది 256GB స్టోరేజ్, 12GB RAM తో వస్తున్నట్లు టాక్.ఈ ఫోన్ ను ర్యాగింగ్ బ్లూ అనే బ్యూటీఫుల్ కలర్ వేరియంట్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై పని చేస్తుంది. IP64 రేటింగ్ తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని తెలిపింది. కంపెనీ దీనిని రూ. 30 వేల బడ్జెట్‌లో ప్రారంభించొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది మెగా కల్ట్ అంటే.. సందీప్ రెడ్డి ఇన్ స్టా వైరల్..
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్‌లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి కూడా ఒకరు. అయితే సందీప్‌ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్‌కే కల్ట్ ఫ్యాన్ సందీప్. అందుకు నిదర్శనమే లేటెస్ట్ ఫోటో ఒకటి అని చెప్పాలి. గతంలో సందీప్ పలు సందర్భాల్లో తాను మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కానీ తన భద్రకాళి సినిమా ఆఫీస్‌లో మెగాస్టార్ ఫోటో చూస్తే మాత్రం మెగాభిమానుల్లో సందీప్ రూటే సపరేట్ అని చెప్పాలి. గత రెండు రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. తమ భద్రకాళి సినిమా ఆఫీస్‌కి సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి తాలూకా మాస్ ఫ్రేమ్ ఒకటి నెక్స్ట్ లెవల్లో ఉంది. చిరు నటించిన ఆరాధన సినిమా నుంచి ఒక సీన్‌లోని ఫ్రేమ్‌ను కట్ చేసి ఫ్రేమ్ చేయించుకోని తన ఆఫీస్‌లో పెట్టుకున్నాడు వంగ. వింటేజ్ ఊర మాస్ మెగాస్టార్ లుక్ పీక్స్‌లో ఉందనే చెప్పాలి. సందీప్‌కు మెగాస్టార్ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరు-సందీప్ కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అంటున్నారు మెగాఫ్యాన్స్. ఇప్పటికే పలు సందర్భాల్లో మెగాస్టార్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు సందీప్. కాబట్టి.. ఈ పవర్ హౌజ్ లాంటి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అయినా సరే, బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధ్వంసం చూస్తామని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం…
రాజ్ తరుణ్, లావణ్య కేసు వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. దాదాపుగా 300మంది అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీసిన మస్తాన్ సాయిప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలన లోబర్చుకుంటున్న మస్తాన్ సాయి, సదరు అమ్మాయిలకు తెలియకుండా రికార్డు చేసిన వీడియోలకు సంబంధించి హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అప్పగించడంతో ఈ కేసు వ్యవహారం మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి తో పాటు మరో యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. తాజాగా మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కటిగా మస్తాన్ సాయి ఆగడాల బయటకు వస్తున్నాయి. గతంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటే మరోసారి బ్లాక్ మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఫ్యాన్ కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్ చేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ కావడంతో ఒక్కొక్కరు గా బయటకు వస్తున్నారు సదరు బాధిత మహిళలు. వందల మంది మహిళలను ట్రాప్ చేసి వారిని శారీరకంగా అనుభవించి వారికి తెలియకుండా వీడియోలు రికార్డ్ చేసాడు మస్తాన్ సాయి. అలా రికార్డ్ చేసిన వీడియోలతో మరోసారి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసి యువతులను బూతులు తిడుతూ మానసిక క్షోభ కి గురి చేసాడు మస్తాన్ సాయి. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్
బాష తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో ప్రభాస్. హీరోగా కంటే తన మంచితనం తో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ప్రజంట్ కెరీర్ పరంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌కు బయటనే కాకుండా సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తను మాత్రం కేవలం సినిమాకు సంబంధించిన విషయాలపైనే అప్‌డేట్లు మత్రమే ఇస్తూంటాడు. తన వ్యాక్తిగత విషయాలు రేర్‌గా పంచుకుంటుంటారు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ గురించి ఓ సీక్రెట్‌ను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రివీల్ చేశారు.. ఇంతకి ఏంటా విషయం అంటే.. ప్రజంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్2’ మూవీలో బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ను రూపొందించారు. ఈ మూవీ మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్ ప్రభాస్ సీక్రెట్ ఒకటి రివీల్ చేశాడు..