Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ మృతి.. కంటతడి పెట్టిన సుమ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’.. ‘సుమ అడ్డా’ వంటి కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఈ అనర్థం జరిగింది. ఈ ప్రమాదంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
Also Read : Varanasi Update: ‘అవతార్’తో పోల్చొద్దు.. జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్!
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
హెల్మెట్లు ధరించకపోవడం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాబీ మరణవార్త విన్న వెంటనే స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్ నుండి హుటాహుటిన రాజమండ్రి చేరుకున్న సుమ, బాబీ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో సుమ కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె, బాబీ మృతి టెలివిజన్ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్ కమెడియన్లు.. ఇతర సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా బాబీకి నివాళులర్పిస్తున్నారు. ప్రతిభావంతుడైన ఒక యువ నటుడు ఇలా చిన్న వయసులోనే ప్రమాదానికి గురై చనిపోవడం బుల్లితెర ప్రేక్షకులను కూడా విషాదంలో ముంచెత్తింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!