వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు.
Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డులో పెట్టిన డబ్బు కార్డు కాలం చెల్లినపుడు తిరిగి రాకపోవడంపై మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అమెజాన్ ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడువు తీరిన వెంటనే వినియోగదారుడి ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యేలా చూడాలని అమెజాన్ కు తెలిపారు.
ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో ఫైయాష్ కోసం గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫైయాష్ కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తమలో తామే దాడులకు పాల్పడ్డారు. ఎర్రగుంట్ల మండలం లోని థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్లైయాస్ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. పాండ్ యాష్ ప్లాంట్ లో లోడింగ్ అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం.…
BC Janardhan Reddy: గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూశారు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయని పేర్కొన్నారు. మొత్తం రూ. 3, 014 కోట్లుతో పనులు చేస్తున్నాం.. రూ. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం అన్నారు.
Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఉహించలేదంట.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు.. అందుకే సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.