CPM Srinivasa Rao: ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఆ లేఖలో ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని 27వ తేదీన విశాఖపట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాల్సింది పోయి సవరించాలని చెప్పడం ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది అని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యూలు కిందకు వస్తుంది.. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి.. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు.. ఇప్పుడు 1/70ని సవరించడం వల్ల గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని శ్రీనివాసరావు చెప్పారు.
Read Also: Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..
ఇక, 1/70 చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతో కొంత భూమిపై అధికారం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. 2006-07లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వామపక్ష పార్టీల ఒత్తిడితో అటవీ సంరక్షణ చట్టాన్ని తెచ్చింది.. భూమిపై గిరిజనుల హక్కులను ఈ చట్టం బలోపేతం చేసింది.. పంప్డ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు 1/70ని సవరించడంతో మరింత వెనకబడిపోతాయన్నారు అని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.