గూగుల్ నుంచి తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. Google Pixel Lite సిరీస్ ధర, స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవే!
- టెక్ దిగ్గజం 'గూగుల్' బిగ్ సర్‌ప్రైజ్
- గూగుల్ నుంచి తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
- పిక్సెల్ లైట్, పిక్సెల్ లైట్ ఎక్స్‌ఎల్ ఫోన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు టెక్ దిగ్గజం ‘గూగుల్’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ రాబోతోందనే టాక్ టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ప్రీమియం సెగ్మెంట్‌కే పరిమితమైన గూగుల్.. ఇప్పుడు తొలిసారి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తోందని తెలుస్తోంది. గూగుల్ పిక్సెల్ లైట్ (Google Pixel Lite), గూగుల్ పిక్సెల్ లైట్ ఎక్స్‌ఎల్ (Google Pixel Lite XL) మోడళ్లను తీసుకురావడానికి సిద్దమయిందట. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు అందిస్తే.. మార్కెట్‌లో ఈ ఫోన్స్ గేమ్ చేంజర్ అవుతాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లీక్స్ ప్రకారం.. గూగుల్ పిక్సెల్ లైట్ 6.3 ఇంచెస్, పిక్సెల్ లైట్ ఎక్స్‌ఎల్ 6.8 ఇంచెస్ డిస్‌ప్లేతో రానున్నాయి. రెండింటిలోనూ 120Hz LTPS FHD+ OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో గూగుల్ స్వంతంగా రూపొందించిన Tensor G సిరీస్ ప్రాసెసర్ ఉండనుందని సమాచారం. దీని వల్ల AI ఫీచర్లు, కెమెరా ప్రాసెసింగ్, డే-టు-డే పనితీరు మరింత మెరుగ్గా ఉండే అవకాశముంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో టెన్సర్ చిప్ రావడం గూగుల్ అభిమానులకు పెద్ద ప్లస్‌గా మారనుంది.
Also Read
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
బ్యాటరీ విషయంలో కూడా గూగుల్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నట్లు సమాచారం. పిక్సెల్ లైట్‌లో 4900mAh, పిక్సెల్ లైట్ ఎక్స్‌ఎల్‌లో 5350mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. రెండింటికీ 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇది రోజువారీ వినియోగానికి సరిపడా బ్యాటరీ బ్యాకప్ అందించనుంది. గూగుల్ అంటేనే కెమెరాకు ప్రత్యేక గుర్తింపు. పిక్సెల్ లైట్‌లో 50MP + 8MP + 12MP రియర్ కెమెరా.. 12MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది. పిక్సెల్ లైట్ ఎక్స్‌ఎల్‌లో 50MP + 8MP + 50MP మెయిన్ కెమెరా.. 24MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ 4K వీడియో రికార్డింగ్ (30fps, 60fps) సపోర్ట్ ఉండనుందని సమాచారం.
అందరిలో ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న అంశం ధరే. లీక్ ప్రకారం.. పిక్సెల్ లైట్ సిరీస్ ధర రూ.35,000 నుంచి రూ.45,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్‌లో ఇంతటి ఫీచర్లు వస్తే.. శాంసన్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఈ రెండు ఫోన్స్ పై స్పెసిఫికేషన్లతో లాంచ్ అయితే బడ్జెట్ సెగ్మెంట్‌లో పెద్ద సంచలనం ఖాయం. గూగుల్ ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని తక్కువ ధరలో అందిస్తే.. ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!