CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తోంది.. త్వరలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆదాయార్జన వాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రీసోర్స్ మొబలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు.. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.. జీఎస్టీ వసూళ్లపై ఆరా తీయడంతో పాటు.. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది.. ప్రజలకు ఇబ్బందుల్లేని పాలసీలు అమలు చేస్తూనే.. ఆదాయం పెంచేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా చెబుతున్నారు..
Read Also: CM Revanth Reddy: ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది