Redmi Note 15 Pro+, Note 15 Pro సేల్స్ ప్రారంభం.. ఆఫర్స్.. ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మి నుంచి తాజాగా విడుదలైన Redmi Note 15 Pro+ 5G మరియు Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారతదేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. జనవరి 29న లాంచ్ అయిన ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లోని రెండు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, పెద్ద AMOLED డిస్ప్లేలు, శక్తివంతమైన ప్రాసెసర్లు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
ధరలు.. బ్యాంక్ ఆఫర్లు
భారతదేశంలో Redmi Note 15 Pro 5G ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్. అదే ఫోన్లో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999గా నిర్ణయించారు. ఈ మోడల్ కార్బన్ బ్లాక్, మిరాజ్ బ్లూ, సిల్వర్ యాష్ రంగుల్లో లభిస్తుంది. మరోవైపు, Redmi Note 15 Pro+ 5G బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 37,999. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 39,999 కాగా, టాప్ వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 43,999గా ఉంది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, కాఫీ మోచా, మిరాజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. HDFC, SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు తక్షణ డిస్కౌంట్ అందిస్తున్నట్లు షియోమీ ప్రకటించింది.
Also Read
- 37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
- 200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు
Redmi Note 15 Pro సిరీస్‌లోని రెండు ఫోన్లు Android 15 ఆధారిత HyperOS 2పై పనిచేస్తాయి. 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్లు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్నాయి. Redmi Note 15 Pro+ 5G లో Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ ఉండగా, Note 15 Pro 5G లో MediaTek Dimensity 7400-Ultra చిప్‌సెట్‌ను అందించారు. ప్రో+ మోడల్లో 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ప్రో మోడల్లో గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజ్ అందుబాటులో ఉంది.
కెమెరా వివరాలు
ఈ సిరీస్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో) మరియు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం Note 15 Pro+ లో 32MP ఫ్రంట్ కెమెరా, Note 15 Pro లో 20MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ & ఛార్జింగ్
Redmi Note 15 Pro+ 5G లో 6,500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Note 15 Pro 5G లో 6,580mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. రెండు ఫోన్లలోనూ 22.5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
-
Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!