YS Jagan: తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు.. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం.. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై జగన్ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు.. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది..
Read Also: Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం 8వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారింది
ఇక, ఇటీవల పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా వంటి అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.. వీటితో పాటు పలు కీలక అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు జగన్.. కాగా, ఈ మధ్యే లండన్ పర్యటనకు వెళ్లివచ్చారు జగన్.. లండన్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్లిన ఆయన.. నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి ఏపీకి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.. ఇక, ఆ తర్వాత తాడేపల్లి ఫార్చూన్ గ్రాండ్ హోటల్ ఎండీ, వైఎస్సార్సీపీ నేత కొండా సూర్య ప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. అక్కడ కూడా జగన్ కాన్వాయ్‌పై పువ్వుల వర్షం కురిపించారు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు..