Mysterious Disease: కోళ్లకు అంతుచిక్కని వ్యాధిపై గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలకు ఈ వ్యాధి లేకపోయినా కొన్నిచోట్ల జాడ కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ కోళ్లకు వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక్కో కోడి 300 రూపాయలు వరకు ధర ఉండగా.. అవి మృత్యు వాత పడకుండా రక్షించుకునేందుకు టీకాలు వేయిస్తున్నారు. లక్ష కోళ్లు పెంచేందుకు 3 కోట్ల రూపాయలు వరకు పెట్టు బడి అవుతుండగా అధికశాతం రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారే.. మాంసం కోసం 45 రోజులపాటు పెంచే బ్రాయిలర్ కోళ్లు ఉమ్మడి గోదావరి జిల్లాలో కోటి వరకు ఉంటాయి. ఒక బ్రాయిలర్ కోడి రెండు కిలోల వరకు తయారయ్యేందుకు 200 రూపాయలు వరకు ఖర్చ వుతుంది. నిన్నమొన్నటి వరకు కిలో చికెన్ ధర 140 రూపాయలు వరకు ఉండడంతో లాభాలపై ఆశలు పెట్టుకున్నారు.
Read Also: AAP vs BJP: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఆప్- బీజేపీ పార్టీల కార్యకర్తలు
అయితే, కొత్త వైరస్ తో ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ రైులు.. కోళ్ల మృత్యువాతతో నష్టపోతున్న రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనపర్తి, కొవ్వూరు ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోళ్లలో వైరస్ జాడలు కనిపించాయి. ప్రస్తుతం వైరస్ ప్రభావం వల్ల గుడ్లు, మాంసం తినే ప్రజల ఆరో గ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలంతా నిశ్చింతగా తినవచ్చు. మన దేశంలో ఉడక బెట్టినవి తినడం అలవాటు. ఇప్పటివరకు ఎవరికీ కోళ్ల వల్ల ఇబ్బందికలిగిన దాఖలాలు లేవు అంటున్నారు పశుసంవర్ధకశాఖ అధికారులు. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 80 కోళ్ల నుంచి నమూనాలు సేకరించి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్రీయ ప్రయో గశాలకు పంపడం జరిగిందని చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు..