Supreme Court: ఆ ఎమ్మెల్యే ప్రొఫైల్‌తో యువతులకు ఎర.. షాదీ డాట్ కామ్‌పై సుప్రీంకోర్టు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: షాదీ డాట్ కామ్‌కు సంబంధించిన అనేక మోసాలు తరచూ వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “షాదీ డాట్ కామ్”తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారిందని కోర్టు పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: Dhurandhar OTT Responce : నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో యానాం ఎమ్మెల్యే ఫొటోతో ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి కాని యువతులను మోసం చేశాడు. ఆ ప్రొఫైల్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక వైద్యురాలు చూసి కాంటాక్ట్ చేసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐటీ శాఖ తన బ్యాంకు ఖాతాలను జప్తు చేసిందని చెప్పి రూ.11 లక్షలు దోచేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇదే తరహాలో ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో తమను మోసం చేసినట్లు నిందితుడి మీద పలువురు యువతులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడితో పాటు, షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్‌ల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వీళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారిస్తూ షాదీ డాట్ కామ్ సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులువుగా చేసిందని, అందుకే మీ మీద కేసు నమోదు చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫైర్ అయ్యారు. ఈ కేసు గురించి తెలంగాణ హైకోర్టు పునఃసమీక్షించుకుని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.
READ MORE: MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!