YS Viveka Case: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు.. ఈ కేసులో దేవి రెడ్డి శంకర్ కొడుకు చైతన్య రెడ్డితో పాటు, గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశంపై కేసు నమోదైంది.. అయితే, ఈ కేసులో తనను ఇబ్బంది పెట్టారని గతంలో కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి.. ఇక, దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ నెల మూడో తేదీన ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు… జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి.. వివరాలను గోప్యంగా ఉంచారు పులివెందుల పోలీసులు.. అయితే, రెండో రోజులు ఆలస్యంగా ఈ కేసు నమోదు వ్యవహారం బయటకు వచ్చింది..
Read Also: Trisha : త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
అయితే, అట్రాసిటీ కేసులో 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు దస్తగిరి.. అతన్ని అరెస్ట్ చేసే సమయంలో డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య బెదిరించడంతో పాటు వైఎస్ వివేకా కేసులో వైసీపీ నేతలకు అనుకూలంగా మాట్లాడాలని కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఇక, నవంబర్ 8వ తేదీన కడప జైలుకు వచ్చిన చైతన్యరెడ్డి.. తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.. రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్టుగా ఫిర్యాదు చేశాడు.. ఇదే జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాస్.. వైసీపీ నేతల మాటలు విని.. తనను ఇబ్బంది పెట్టారని.. ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిసిన ఫిర్యాదు చేయడంతో.. ఆ నలుగురిపై కేసులు పెట్టారు పోలీసులు..