Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తూ.. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. గతంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించారు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ.. సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.. ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 3 నూతన జిల్లాల్లో, గత 4 నెలల్లో 1,756 రోడ్ల నిర్మాణం చేపట్టి, 94.50 కోట్ల వ్యయంతో, 273.42 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర… pic.twitter.com/Qu6OsBfotN
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 5, 2025