Vizag Crime: విశాఖలో జ్యోతిష్యుడు మృతి కేసును ఛేదించారు పోలీసులు.. బీమిలి బీచ్ రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు, ఎరుపు, పసుపు పూసల దండలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె అవశేషం కనిపించాయి. అస్థిపంజరం వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు, 50 ఏళ్ల మోతి అప్పన్నదిగా గుర్తించారు కుటుంబ సభ్యులు. గుర్తు తెలియని వ్యక్తి మోతి అప్పన్నను ఇక్కడకు తీసుకొచ్చి చంపేసిన తర్వాత మృతదేహాన్ని కాల్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే, జ్యోతిష్యుడిది హత్యగా తేల్చారు పోలీసులు.. హత్యకు ఓ మహిళా తో జ్యోతిష్యుడు అసభ్య ప్రవర్తనే కారణంగా చెబుతున్నారు..
Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది? కేటీఆర్, కవిత మీటింగ్స్ లో మోగుతున్న సీఎం నినాదాలు
భీమిలి కాపుల్పాడ లే అవుట్‌లో దొరికిన శరీర భాగాలను మోతి అప్పన్నగా గుర్తించారు పోలీసులు.. మోతి అప్పన్న(50)ను హత్య చేసింది నేరళ్లవలసకు చెందిన ఉల్లా చిన్నారావు, గుడ్డా మౌనికగా గుర్తించి.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ఆనందపురం పోలీసులు.. అయితే, చిన్నారావు, మౌనిక ఇద్దరు ఆనందపురం ఎల్వి పాలెంలో నెల క్రితం ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు… ఎల్వి పాలెంలో ఒక టీ షాపునకు అప్పన్న దొర తరచుగా వెళ్లేవాడు.. అక్కడ పరిచయం ఏర్పడింది.. పూజల ద్వారా సమస్యలను తీరుస్తారని మౌనిక కు కుడా సమస్యలు ఉన్నాయ అని అడిగాడు.. మౌనిక ఇంటికి అప్పన్న వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు.. తనను బలవంతం చేశాడు.. ఈ విషయం ఎవరికి చెప్పినా మీ కుటుంబానికి హాని చేస్తానని బెదిరింపులకు దిగాడు.. అయితే, జరిగిన విషయం తన భర్త చిన్నారావుకు తెలిపింది మౌనిక.. దీంతో, అప్పన్నను చంపాలనే ప్లాన్ చేశారు.. తమ ప్రణాళికలో భాగంగా చిన్నారావు బంధువులకు ఆరోగ్యం బాగోలేదని పూజ చేయటం కోసం 7 వేల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు.. అంతేకాదు.. అప్పన్నను చంపటానికి ఒక బటన్ నైఫ్, ఒక ద్వీచక్ర వాహనం ఉపయోగించారు.. ఉప్పాడలో చిన్నారావు తల్లి ఇంటికి తీసుకోని వెళ్తానాని బోయిపాలెం ఓ ప్రవేటు లే అవుట్ లోకి తీసుకోని వెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు.. అయితే, హత్య చేసే సమయంలో చిన్నారావు కుడిచేతికి గాయం కావడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందారు.. మళ్లీ మంగళవారం ఉదయం వెళ్లి.. రెండు లీటర్ల టిన్నర్, పెట్రోల్ పోసి కాల్చివేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు..
Read Also: CM Revanth Reddy : రేపు పోలేపల్లి జాతరకు సీఎం రేవంత్ రెడ్డి
కాగా, బీమిలి బీచ్ రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు, ఎరుపు, పసుపు పూసల దండలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె అవశేషం కనిపించాయి. అస్థిపంజరం వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు, 50 ఏళ్ల మోతి అప్పన్నదిగా గుర్తించారు కుటుంబ సభ్యులు. పెందుర్తిలోని బీసీ కాలనీలో మోతి అప్పన్న కుటుంబం నివాసముంటుంది. అప్పన్న భార్య, ఇద్దరు కుమారులతో పెందుర్తిలో నివాసముంటున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఈ నెల 9న ఆనందపురం వెళ్తానని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిన అప్పన్న.. ఆ రోజు రాత్రికి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆ మర్నాడే తన తండ్రి కనిపించట్లేదని అప్పన్న పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్.. ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఆ రోజు నుంచి అప్పన్న కోసం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో వెతికారు. ఆనందపురం, బోయపాలెం ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. 9వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బోయపాలెం నుంచి చేపలుప్పాడ వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై అప్పన్న వెనుక కూర్చుని వెళ్లడం గుర్తించారు. చివరకు దంపతులే హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు..