Perni Nani: కూటమి ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని.. విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అనధికారికంగా కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించారు.. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తల ఫోన్ నంబర్స్ ఇటీవల కలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. ట్యాప్ చేస్తున్నారనే టీడీపీ లీడర్స్ ని కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నరట్టు చెప్పుకొచ్చారు..
అసలు గ్రామ స్థాయి లీడర్స్.. వాళ్ల భార్య ఫోన్ నంబర్స్ తో ఏం పని అని ప్రశ్నించారు పేర్నినాని.. విజయవాడలో అనధికారికంగా చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి సిబ్బందిని నియమించుకుని ఫోన్స్ చేసి వైసీపీ నేతలను బెదిరించాలని చూస్తున్నారన్న ఆయన.. విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి అనధికారికంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.. ఇక, కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.. ఇలా తప్పుడు పనులు చేసిన వాళ్లందరినీ చట్టం ముందు నిలబెడతానని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్నినాని..
Read Also: CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర పై మాజీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు.. గత ఏడాది నవంబర్ నుండి మొరుగుతున్నావు… నన్ను అరెస్టు చేస్తానంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నావు.. ధైర్యంగా రోడ్లమీద తిరుగుతున్నా.. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి.. నీ అరెస్టు వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి పేర్నినాని..