SRM University: గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు…
Eluru Police: గుట్టు చప్పుడు కాకుండా అందినకాడికి దండుకొని ఎంజాయ్ చేసే దొంగలు ఉన్నారు.. అయితే, ఏ దొంగ అయినా.. ఇప్పుడు కాకపోతే.. కొంత కాలానికైనా దొరకకుండా తప్పించుకోలేడు.. మరికొందరైతే పోలీసులకే సవాల్ విసిరే వాళ్లు ఉన్నారు.. తాజాగా, పోలీసులకు సవాల్ విసిరిన ఓ దొంగను పట్టుకుని.. చుక్కలు చూపించారు పోలీసులు.. బైక్ చోరీలకు పాల్పడడమే కాదు.. చోరీ చేసిన బైకులను అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ.. 100…
Konda Rajiv Gandhi: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన అని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీధిలైటు వెలగకపోతే తనకు తెలుస్తుందన్న చంద్రబాబుకు కేజీహెచ్ లో 12 గంటలు కరెంటు లేదన్న విషయం ఎందుకు తెలియ లేదు..? అని ప్రశ్నించారు.. పేదల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి బాధ్యత…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల…
Delhi Science Tour : సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు న్యూ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున ఎంపికైన విద్యార్థులు ప్రస్తుతం ఢిల్లీలో పలు సైన్స్ సంబంధిత కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఘజియాబాద్‌లోని కైట్ ఇంజనీరింగ్ కాలేజ్, మురాద్‌నగర్‌లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్‌లో…
AP Update : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాల వ్యవస్థకు కొత్త రూపురేఖలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ సచివాలయాలకు కొత్త పేరు పెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇకపై వాటిని “విజన్ యూనిట్స్” (Vision Units)గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన మంత్రులు, అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, “గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే…
YS Jagan: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఈ వ్యవహారంలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు.. అసలు చంద్రబాబు చేసింది ఏముంది? అని నిలదీశారు.. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైయస్సార్సీపీ.. అదానీ-గూగుల్‌కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా…
Gautam Reddy: తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చిన పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం సరికాదు అన్నారు.. ప్రశాంతంగా ఉండే నగరాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా..? అని మండిపడ్డారు.. నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి…
ఏపీలో రెండో రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్…