Madvi Hidma: మోస్ట్ వాంటెండ్ మావోయిస్ట్ మడావి హిడ్మా హతమయ్యాడు. నవంబర్ 30లోపు హిడ్మాను హతమారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంతో శపథం చేశారు. గడువుకు 12 రోజుల ముందే హిడ్మా ఎన్‌కౌంటర్ లో హతమయ్యాడు. మంగళవారం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ట్రై-జంక్షన్‌లోని దట్టమైన పుల్లగండి అడవులలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్లలో హిడ్మాను భద్రతా దళాలు హతమార్చాయి. హిడ్మా హతం మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఎన్నో దాడులకు పాల్పడిన హిడ్మా, చాలా కాలంగా భద్రతా దళాలకు టార్గెట్‌గా ఉన్నాడు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు తిరుగుబాటులో హిడ్మా అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగాడు.
హిడ్మా దాడుల వ్యూహరచన, గెరిల్లా వార్ ఫేర్ మావోయిస్టు దాడుల నిర్వచనాన్నే మార్చాయి. దీనికి 2013లో జరిగిన జీరామ్ ఘాటి దాడే ఉదాహరణ. ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం నిర్మాతగా ఉన్న మహేంద్ర కర్మతో పాటు ప్రధాన కాంగ్రెస్ నాయకుల్ని చంపేశారు. ఈ దాడి తర్వాత ఒక్కసారిగా హిడ్మా పేరు మార్మోగింది. భద్రతా బలగాలపై అనేక సార్లు దాడులకు పాల్పడ్డాడు.
Read Also: Operation Sindoor: ఇది భారత్ దెబ్బ.. 6 నెలలైనా కోలుకోలేని పాకిస్తాన్..
1981 ప్రాంతంలో సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో జన్మించాడు. అప్పటి వరకు మావోయిస్టు అగ్రనాయకత్వంలో ఏపీ, తెలంగాణకు చెందిన గిరిజనేతరులే ఉండే వారు. అయితే, హిడ్మా ఈ పద్ధతిని మార్చాడనే చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా చదువు లేకపోయని, అడవులపై మంచి పట్టు ఉంది. ఇదే కాకుండా అనతికాలంలోనే మావోయిస్టు దాడుల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే PLGA “బెటాలియన్ నం.1”కు కమాండర్‌గా ఎదిగాడు. ఒక గిరిజన వ్యక్తి మావోయిస్టుల్లో అగ్రనాయకుడిగా ఎదగడం, బస్తర్ గిరిజనుల్లో చాలా మందిని ప్రభావితం చేసింది. దీంతో చాలా మంది గిరిజనుల మద్దతు పొందడంతో పాటు నక్సల్స్ లో చేరారు.
హిడ్మాకు అబూజ్‌మడ్ అడవులపై మంచి పట్టు కూడా ఉంది. దీంతోనే సులువుగా దాడులు నిర్వహించడంలో దిట్ట. గెరిల్లా యుద్ధంలో ఆరితేరాడు. ఐఈడీ బాంబుల తయారీకి నేర్పరిగా మారాడు. బస్తర్ అడవుల్లోని గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక ప్రతీకగా కనిపించాడు. ఇది యువ గిరిజనులను మావోయిజం వైపు ఆకర్షణ పెరిగింది.