* ఇవాళ ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. శ్రీ సత్య సాయి శత జయంతి కార్యక్రమానికి హాజరుకానున్న మోడీ.. ఇవాళ ఉదయం 9.30కి సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11 గంటల నుంచి సత్య సాయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు..
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని.. 10 గంటలకు రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి వెళ్లనున్న ప్రధాని. సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించనున్న మోడీ.. 10.30 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో ప్రపంచ మహిళా దినోత్సవం.. రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ.
* బీహార్‌లో రేపు ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం.. ఇవాళ రాత్రికి పాట్నా చేరుకోనున్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా.. 10వ సారి సీఎంగా రేపు ప్రమాణ్వీకారం చేయనున్న నితీష్ కుమార్
* పాట్నా: ఈ రోజు ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. అనంతరం ఎన్డీఏ కూటమికి చెందిన శాసన సభ నేతగా నితీష్ కుమార్ ఎన్నిక
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం కడప జిల్లా లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన.. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ, కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. వెల్లూరులోని మన గ్రోమోర్ ఎరువులు కేంద్రాన్ని పరిశీలించనున్న చంద్రబాబు.. సాయంత్రం చిన్న దొర పల్లెలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి.
* హైదరాబాద్: నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటలకు చీరల పంపిణీని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం.. రెండు దశలుగా చీరలు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. తొలి దశలో నేటి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో చీరలు పంపిణీ.. రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పట్టణాల్లో చీరలు పంపిణీ
* నేడు సీపీఐ నేత రామకృష్ణ నివాసానికి సీఎం చంద్రబాబు.. సీపీఐ రామకృష్ణ కుమార్తె వివాహం సందర్భంగా ఆశీర్వదించనున్న సీఎం చంద్రబాబు..
* హైదరాబాద్: ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
* ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి పంజా .. పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. పెరుగుతున్న చలి తీవ్రత.. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లా 6.8గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. ఆదిలాబాద్ జిల్లాలో 8.9, నిర్మల్ జిల్లా లో 9.9..మంచిర్యాల జిల్లాలో 11.3 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* మంచిర్యాల: నేడు జిల్లా లో మంత్రి వివేక్ పర్యటన. చెన్నూరు లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ఏరియా హాస్పిటల్ మార్చురీలో పోస్టుమార్టం .. కుటుంబ సభ్యులు రావడం ఆలస్యం కావడమే పోస్టుమార్టం ఆలస్యనికి కారణం.. మరికొద్ది గంటల్లో రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కు చేరుకోనున్న మృతుల కుటుంబ సభ్యులు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలో పర్యటన .. ఉదయం 9:30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకొనున్న మంత్రి లోకేష్ .. ఉదయం 10 గంటలకు అధికవి. నన్నయ్య యూనివర్సిటీలో. విద్యార్థులతో ముఖాముఖి.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.. మధ్యాహ్నం ఒంటిగంటకు చెరుకురి గార్డెన్స్ లో ఉత్తమ కార్యకర్తలకు సత్కారం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రెండో విడత నిధులు.. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్ధం.. ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.7 వేలు
* విశాఖ: నేడు పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం.. భారీగా తరలి రానున్న భక్తులు.. 500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు.. ఘాట్ ఏరియాలో డ్రోన్ కెమెరాల తో ప్రత్యేక నిఘా
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు కామేశ్వరి దేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన ,స్వామివారికి రుద్రాభిషేకం
* రేపు తిరుపతిలో రాష్ట్రపతి పర్యటన.. రేపు , ఎల్లుండు తిరుమల తిరుపతిలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నవంబర్ 20 న మధ్యాహ్నం 3.25 గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి రాక. 3.55 నుంచి 4.30 గంటల వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం. అనంతరం రోడ్డు మార్గ తిరుమల పయనం
* తిరుమల: కొనసాగుతున్న ఫిబ్రవరి నెల ఆర్జిత సేవా టిక్కెట్ల కేటాయింపు .. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ లో ఆర్జిత సేవా టికెట్లు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు
* పల్నాడు జిల్లా: నేటి నుంచి ప్రారంభం కానున్న పల్నాటి వీరుల ఉత్సవాలు. కారంపూడిలో వీరుల ఉత్సవాలు. తొలి రోజు రాచగావుతో ప్రారంభం. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు. వీరుల ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా హాజరుకానున్న భక్తులు
* మావోయిస్టుల అరెస్టుపై నేడు విజయవాడలో పోలీసుల మీడియా సమావేశం.. ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పట్టుబడ్డ మావోయిస్టుల అరెస్టుపై నేడు వివరాలు వెల్లడించనున్న పోలీసులు
* మిథున్‌రెడ్డి పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ.. ఈ నెల 21న ఢిల్లీ వెళ్తున్నానని సిట్ ఆఫీసులో హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్