కాసేపట్లో పుట్టపర్తికి ప్రధాని మోడీ
సత్య సాయి శత జయంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతోంది. పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచ వ్యాప్తంగా సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భావించింది. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెంట్రల్ ట్రస్ట్‌తో అనుసంధానం చేసుకునేలా ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏడాది కాలంగా బాబా జయంతి ఉత్సవాలకు ప్లాన్ చేశారు. ఇప్పటికే బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తిలో కోలాహలం నెలకొంది. దేశవిదేశీ భక్తులు 220కిపైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి, భోజనం, దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు. సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే శాఖ 160 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాసేపట్లో ప్రధానికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలుకుతారు. ఈనెల 23న ఉత్సవాలు ముగిసేదాకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ శాఖలతో శ్రీ సత్యసాయి ట్రస్టు సమన్వం చేసుకుంటోంది. సత్య సాయి జయంతి వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు ప్రధాని మోడీ.. ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు.. సత్యసాయి జయంతి వేడుకలు సందర్భంగా ప్రశాంతి నిలయానికి భారీగా పోటెత్తారు భక్తులు. హిల్ వ్యూ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చారు.. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని వంద కాయిన్, స్టాంపులను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ.. ఇక, ప్రధాని రాక సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో పట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. అడుగడుగునా మూడు అంచెల పోలీసు భద్రతలోకి పుట్టపర్తి వెళ్లిపోయింది.. ఇక, రాత్రి పుట్టపర్తి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. డబుల్ ధమాకా..! నేడు ఖాతాల్లో సొమ్ము జమ..
రైతన్నలకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. నేడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు జమ కానున్నాయి. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాలో రెండో విడతలో ఏడు వేల లెక్కన జమ చేయనుంది ప్రభుత్వం. ఇవాళ కడప జిల్లా కమలాపురం, పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు NPCAలో ఉపయోగించని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తేవాలని క్షేత్ర స్ధాయిలో వ్యవసాయ అధికారులు సమన్వయం చేసుకుని పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు న్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయబోతోంది ప్రభుత్వం. రెండో విడతలో మొత్తం 46 లక్షల 62 వేల 904 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా ఈ పథకం మీద సందేహాలు నివృత్తి చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం వాటా 2 వేలు, రాష్ట్ర వాటా 5 వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఒక్కొక్క రైతుకు చెల్లిస్తారు..
దేశ చరిత్రలోనే అత్యంత పెను విషాదం.. దివిసీమ పెను ఉప్పెనకు 48 ఏళ్లు..
1977 నవంబర్ 19 శనివారం తుఫాను వర్షం కురుస్తుంది.. ఎప్పటిలాగే తీరం దాటుతుంది అని దివిసీమ ప్రజలు నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రిని కాళరాత్రిగా మారుస్తూ ఒక్కసారి ప్రళయం ముంచెత్తింది. మీటర్ల కొద్దీ (సుమారు 3 తాడిచెట్ల ఎత్తులో) ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు కరకట్ట కట్టలు దాటి ఊళ్ళు మీద విరుచుకు పడ్డాయి. సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు ఊళ్లను కబళించాడు. నిద్రలోని వారిని శాశ్వత నిద్రలోకి తీసుకెళ్ళాయి. పశుపక్ష్యాదులు అల్లకల్లోలమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకొని పోయాయి. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు సైతం విరుచుకుని పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విల్లులా వంగిపోయాయి. తలచుకుంటేనే వొళ్ళు గగుర్పొడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ళకు కదలాడుతూనే ఉన్నాయి. పెను ఉప్పెన దాటికి పొంగిన అలలు సుమారు 83 గ్రామాలను జలసమాధి చేస్తూ ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మనుషులు, పశువుల శవాలతో ఎటు చూసినా కూలిపోయిన ఇళ్లు, చెట్లు, కళ్ళముందే మనుషుల్ని, పశువుల్ని తాడిచెట్ల ఎత్తంత పరిణామానికి ఎగురవేస్తూ అతి భయంకరమైన విలయతాండవం సృష్టించింది. కృష్ణాజిల్లా, కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, ఇరాలి, గొల్లపాలెం, బసవనిపాలెం, ఊటగుండం (మరియు), నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సోర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ తదితర మత్సకార ప్రాంతాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు పదివేలమందికి పైనే ఈ విపత్తుకు యావత్ భారతదేశం మొత్తం నివ్వెరపోయింది. ప్రభుత్వం మరియు మరికొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకున్నాయి. ఉప్పెనలో మరణించిన వారికి గుర్తుగా అవనిగడ్డ మండలం పులిగడ్డలో స్మారక స్థూపం నిర్మించారు. సోర్లగొంది గ్రామాన్ని పోలీసు వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. అప్పటి మూలపాలెం ని (ఆర్ ఎస్ ఎస్)RSS, వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, బండారు దత్తాత్రేయ లు,సీనికళాకారులు, వివిధ రాజకీయ పార్టీలు నాయకులు,కూడా ఈ ఊరుని సందర్శించారు.(అప్పటి మూలపాలెం నేడు ధీనదయాళ పురం) సోర్లగొంది లో ఉప్పెన కు గుర్తుగా ఈ గ్రామ ప్రజలు ప్రతియేటా నవంబర్ 19 న సంబరాలు చేసుకుంటూ, యువకులకు ఆటల పోటీలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సంతాపం తెలియచేస్తారు. ఆనాటి ఉప్పెన గురించి సోర్లగొంది లోని జాలయ్య పడే పాటలో ఉప్పెన విధ్వంసం మొత్తం మనకు వినిపిస్తుంది…
సంచలనం.. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..
పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015–16 సంవత్సరాల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలపై అప్పటికే వచ్చిన పలు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. టీజీపీఎస్సీ హైకోర్టు గత ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. తీర్పులో టీజీపీఎస్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని, ఫలితాల ప్రక్రియలో విధివిధానాలు సరిగా పాటించలేదని న్యాయమూర్తి తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఇప్పటికే కోర్టు సూచించిన ప్రమాణాలను పాటించకుండా కమిషన్ నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2 పరీక్షలకు సంబంధించిన మొత్తం ఫలితాలను పునర్‌మూల్యాంకనం చేయాలని, అర్హుల కొత్త జాబితాను రూపొందించి విడుదల చేయాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాలలోపు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన గడువు విధించింది. ఈ తీర్పుతో గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి.
పోలీసన్నా ఏందే ఇదీ..! పోలీసు పెట్రోలింగ్ వెహికల్‌తో యువకుల రీల్స్..(వీడియో)
యువతలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధ పనులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ఏకంగా పోలీస్ వాహనాలతోనే రీల్స్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. పోలీసు పెట్రోలింగ్ వాహనంతో.. రీల్స్ చేయడం ఏంటి? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఇన్నోవా వాహనంలో రీల్స్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు యువకులు.. అధికారిక వాహనంలో రీల్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదిరిపోయే లెవల్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాహనం ఎవ్వరు ఇచ్చారు..? రీల్స్‌కు అనుమతి ఎవరిచ్చారని పోలీస్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇద్దరు యువకుల రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేటి నుంచే ఇందిరమ్మ “కోటి” చీరల పంపిణీ.. చివరి తేదీ ఇదే..
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక బహుమతిగా కోటి ఇందిరమ్మ చీరలను అందజేయడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంగళవారం మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు దశల్లో చేపడుతోంది. మొదటి దశలో బుధవారం నుంచి డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు.
ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఎంత అద్దె చెల్లించారంటే..!
ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. తవ్వేకొద్దీ కుట్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా ఉగ్రవాదులకు సంబంధించిన మరో కారును అధికారులు గుర్తించారు. ఉగ్ర కుట్రలో భాగంగా 5వ వాహనం అద్దెకు తీసుకున్నట్లుగా కనిపెట్టారు. హ్యుందాయ్ i10 కారును అద్దెకు తీసుకున్నారు. అక్టోబర్ 24-27 మధ్య ఈ కారును అద్దెకు తీసుకున్నట్లు కనిపెట్టారు. నవంబర్ 10న ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు కొన్ని రోజుల పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా రహస్యంగా పేలుడు పదార్థాలను తరలించినట్లుగా గుర్తించారు. ఈ కారు ఒక టాక్సీ యజమానిదిగా చెందినది.. మూడు రోజుల అద్దెకు రూ.4,000 చెల్లించారు. డ్రైవర్‌ను తీసుకెళ్లేందుకు నిరాకరించినట్లు యజమాని చెప్పాడు. డాక్టర్ ముజమ్మిల్ ఇంట్లో పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్, ఇతర రసాయనాలు నిల్వలు ఉన్నాయి. వీటిని రవాణా చేయడానికి అద్దె కారును ఉపయోగించినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఉమర్ అద్దె కారును ఉపయోగించే పేలుడు పదార్థాలు రవాణా చేసినట్లుగా స్పెషల్ సెల్ అధికారులు కనిపెట్టారు.
ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు చట్టసభ ఆమోదం.. ట్రంప్ ఏం చేయబోతున్నారో..!
అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు. విషయాన్ని బహిర్గతం చేయొద్దు అంటూ సభ్యులపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఏ మాత్రం తలొగ్గలేదు. ట్రంప్ బెదిరింపులకు వ్యతిరేకంగా ఎక్కువ మంది సభ్యులు ధిక్కరించినట్లు కనిపించింది. సెక్స్ కుంభకోణంలో 1,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు చట్టసభ సభ్యులు అంటున్నారు. 428 మంది సభ్యుల్లో ఒక్కరు మాత్రమే వ్యతిరేక ఓటు వేశాడు. మిగతా వారంతా అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ఫైళ్లు విడుదలకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెల్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చట్టసభ ఆమోదించిన బిల్లును ప్రస్తుతం ట్రంప్ దగ్గరకు పంపించారు. బిల్లుపై సంతకం చేస్తారా? లేదా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
UPI క్రెడిట్ లైన్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే?
ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన రుణదాతలు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా క్రెడిట్ చెల్లింపులను అందించడానికి ముందుకు వస్తున్నాయి. UPI ద్వారా క్రెడిట్ లావాదేవీల కోసం బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు RuPay క్రెడిట్ కార్డులను అందిస్తున్నప్పటికీ, వారు ఇప్పుడు “క్రెడిట్ లైన్ ఆన్ UPI” ఫీచర్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీని వల్ల ఎలా ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఈ ప్రొడక్ట్ ని ప్రారంభించడానికి ఫిన్‌టెక్ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయని చెప్పారు. Navi, Super Money, SalarySe వంటి స్టార్టప్‌లు ఈ ఫీచర్ ను అందించడానికి ఈ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలిపారు. అయితే, HDFC బ్యాంక్, Axis బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.
7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉన్న Moto G57 Power భారత్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..!
మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్‌లోని Moto G57 Power స్మార్ట్‌ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్‌సెట్‌తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా, డిస్‌ప్లే పరంగా కూడా ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6.72 అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ, IP64 రేటింగ్ వంటి ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫోన్‌ను మరింత మన్నికైనదిగా మార్చుతుంది. ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బాక్స్ నుండి బయటకు వచ్చే తొలి ఫోన్‌లలో ఇదొకటి. మోటరోలా ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో పాటు మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఇక మెమరీ, ఆడియో పరంగా చూస్తే.. Moto G57 Power మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభ్యం కాబోతోంది. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఆడియో అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌ను పాంటోన్ రెగట్టా, పాంటోన్ కోర్సెయిర్, పాంటోన్ ఫ్లూయిడిటీ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందిస్తున్నారు. లాంచ్ అనంతరం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్సైటు, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ధరను నవంబర్ 24న అధికారిక లాంచ్ కార్యక్రమంలో ప్రకటించనున్నారు.
కచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా..
పూణే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన పెళ్లి విషయం పై నేరుగా, ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా మాట్లాడని భాగ్యశ్రీ, ఈసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ అండ్ క్లియర్ ఆన్సర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్వ్యూలో యాంకర్ “లవ్ మ్యారేజ్ చేస్తావా? లేక అరేంజ్ మ్యారేజ్?” అని ప్రశ్నించగా, భాగ్యశ్రీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “లవ్ మ్యారేజ్ చేసుకుంటా” అని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో యాంకర్ అడిగిన మరో ప్రశ్న .. “అయితే ప్రస్తుతం ఎవరైనా లవ్‌లో ఉన్నారా?” కి ఆమె సింపుల్‌గా “ప్రస్తుతం లవ్‌లో లేను” అని సమాధానమిచ్చింది. దాంతో యాంకర్ మళ్లీ కౌంటర్‌గా “లవ్‌లో లేకపోయినా లవ్ మ్యారేజ్ చేస్తానని ఎలా చెప్తున్నారు?” అని అడగ్గా, భాగ్యశ్రీ ఇచ్చిన రిప్లై మాత్రం చాలామందిని ఆకట్టుకుంది. “నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎప్పటికైనా నాకు నచ్చే, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి తప్పకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఇది ఫిక్స్” అని ఆమె చెప్పింది. ప్రస్తుతం భాగ్యశ్రీ రామ్‌తో కలిసి నటించిన ‘ఆంధ్రకింగ్’ ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చెప్పిన పెళ్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ సరసన ఫ్రెష్ పెయిర్‌గా కనిపిస్తున్న భాగ్యశ్రీ, ఈ సినిమాతో మంచి మార్క్ క్రియేట్ అవ్వాలని ఆశ పడుతోంది.
వంద కోట్ల హీరో సినిమా.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కాకుండానే రిలీజ్ కు రెడీ
డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. కానీ ఈ హీరో నటించిన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2024 జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఆ డేట్ వాయిదా వేసి డిసెంబర్ 15న రిలీజ్ చేస్తామని మరో డేట్ ప్రకటించారు మేకర్స్. LIK చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోతో పాటు, దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అదే టైమ్ లో విఘ్నేష్ శివన్ కు శాటిలైట్, డిజిటల్ రైట్స్ అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం తమిళనాడు థియేట్రికల్ విడుదల హక్కులను సెవెన్ స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్ కలిగి ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది కానీ ఇప్పటికి నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ కాలేదు. ఈ నేపధ్యంలో మరోసారి పోస్ట్ పోన్ చేయాలనీ లలిత్ కుమార్ భావించగా సినిమా విడుదలైన తర్వాత కూడా అమ్మకాలను తాను నిర్వహిస్తానని విఘ్నేష్ శివన్ చెప్పడంతో రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా తమిళ్ రైట్స్ ను రెడ్ జెయింట్ సంస్థ షెన్‌బగమూర్తి విడుదల చేయబోతున్నారు. ఆయన తన సొంత సంస్థ MSM కింద ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దాదాపు రూ. 15 కోట్లు అడ్వాన్స్ చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. మొత్తానికి డిజిటల్ డీల్ కాకుండానే రిలీజ్ అవుతుంది LIK.
రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ షూటింగ్ అప్‌డేట్ !
‘కాంతార: చాప్టర్ 1’తో రిషబ్ శెట్టి భారత సినీ పరిశ్రమలో తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ప్రతీ ఫ్రేమ్‌పై పర్ఫెక్షన్ కోసం ఎంత కష‍్టపడ్డారో ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పినా, సినిమా చూసిన ప్రేక్షకులు మరింత బలంగా అర్ధం అయింది. గత నెల విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకొని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. సినిమా విజయంతో రిషబ్ శెట్టి ఫ్యామిలీతో, స్నేహితులతో, టీమ్‌తో రిలాక్స్ అవుతూ, సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరో వైపు ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఏ జనర్‌లో ఉంటుంది? అన్న చర్చలు సోషల్ మీడియాలో పెద్ద హీట్‌గా మారాయి. రిషబ్ శెట్టి స్థాయిలో ఉన్న దర్శక–నటుడు తరువాత ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ సస్పెన్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..