మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వొద్దు.. మళ్లీ వైకుంఠపాళి వస్తే నాశనమైతాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి.. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం.. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్ వొద్దు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
CM Chandrababu: విజయవాడ నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో కాలినడకన చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళిన సీఎం.
Kishan Reddy : నక్సలిజం నిర్మూలనలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా వందలాదిమంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి సాధారణ జనజీవనంలో కలవడాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు. గత మూడు రోజుల్లోనే 300 మందికి పైగా నక్సలైట్లు అధికారాల వద్దకు వచ్చారని కిషన్ రెడ్డి…
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ..…
భవిష్యత్తు అంతా యువతదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యువత కోసమే పార్టీ కార్యాలయంలో అనేక నిర్మాణాలు చేపడుతున్నాం.. కొత్త తరం రాజకీయ నాయకులకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరంతరం శిక్షణ ఇస్తాం.
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది.
AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు.
Minister Partha Sarathy: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అని మంత్రి పార్థసారథి తెలిపారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుంది.. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది.. గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని మండిపడ్డారు.
Union MInister Rammohan Naidu: ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. కానీ, గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు.. డేటా సెంటర్కి అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్.. ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. స ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వస్థతలో ఏపీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సూర్యభగవానుని పరిసరాల్లో స్వచ్చత కార్యక్రమం చేశాం.. 25 లక్షల మోక్కలు నాటాం..…