Trump: ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’.. టారిఫ్‌లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం
- ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’
- టారిఫ్‌లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం
- అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ న్యాయమూర్తులపై విరుచుకుపడ్డారు. ‘‘రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లు మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’ అంటూ ధ్వజమెత్తారు. న్యాయస్థానంలోని కొంత మంది సభ్యుల తీరు పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. 6-3 తేడాతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత చాలా నిరాశ చెందినట్లుగా చెప్పారు. మన దేశానికి సరైంది చేయడానికి న్యాయమూర్తులకు ధైర్యం లేదన్నారు. డెమొక్రాట్లు నియమించిన న్యాయమూర్తలు అవమానకరం అని అభివర్ణించారు.
ఈ తీర్పుతో సంవత్సరాలుగా మనల్ని మోసం చేస్తున్న విదేశీ దేశాలన్ని సంబరాల్లో మునిగిపోయాయన్నారు. ప్రస్తుతం వాళ్లంతా సంతోషంగా ఉంటారని తెలిపారు. ఇప్పుడు వాళ్లు వీధుల్లో నృత్యం చేస్తూ ఉంటారు.. కానీ వారు ఎంతో కాలం నృత్యం చేయలేరులే అన్నారు. తన పరిపాలన ప్రత్యామ్నాయ చర్యలతో ముందుకొస్తుందని హెచ్చరించారు. దేశభక్తి లేని వారు రాజ్యాంగం పట్ల విశ్వాసపాత్రులు కాదన్నారు. 2024లో మిలియన్ల ఓట్లతో గెలిచానని.. కానీ తన అజెండాకు మద్దతు ఇచ్చేందుకు న్యాయమూర్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్‌ఎస్‌కు అధికారం అక్కర్లేదు.. మా లక్ష్యం అది కాదన్న మోహన్ భగవత్
ఇక తీర్పును విభేదించిన న్యాయమూర్తులు క్లారెన్స్ థామస్, శామ్యూల్ అలిటో, బ్రెట్ కవనాగ్‌లను ట్రంప్ ప్రశంసించారు. టారిఫ్‌లు కొట్టేసిన ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్, న్యాయమూర్తులు అమీ కోనీ బారెట్, నీల్ గోర్సుచ్‌లను తీవ్రంగా విమర్శించారు. వారంతా ‘‘రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లకు మూర్ఖులు, లాప్‌డాగ్‌లు.’’ అని దుమ్మె్త్తిపోశారు.
అయినా అలా తీర్పు వచ్చిందో లేదో తగ్గేదేలేదంటూ ట్రంప్ తన దూకుడును చూపించారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఓవల్ కార్యాలయం నుంచి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసి సోషల్ మీడియాలో వెల్లడించారు. కొత్త ఉత్తర్వు ప్రకారం అన్ని దేశాల నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించడంపై తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రాసుకొచ్చారు.

US President Donald Trump posts, "Those members of the Supreme Court who voted against our very acceptable and proper method of TARIFFS should be ashamed of themselves. Their decision was ridiculous but, now the adjustment process begins, and we will do everything possible to… pic.twitter.com/P543UGa67u
— ANI (@ANI) February 21, 2026
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!