ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి పెట్టారు.. ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు పెట్టారు... ఎమ్మెల్యేలు.. కూటమి నేతలు కలిసి పని చెయ్యాలని. కూడా మంత్రులు చెబుతున్నారు..
బర్డ్ ప్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణలో భాగంగా కేరళ సీబీఐ అధికారులు కాకినాడకు వచ్చారు. 2023 నవంబర్ 25వ తేదీన సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా.. ఆ మృతదేహం ఎవరిదని అధికారులు ఆరా తీశారు. అయితే.. మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం.. సంతోషించదగిన విషయం అని అన్నారు. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఈనెల 23న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC ) హాల్ టికెట్లు విడుదల చేసింది. psc.ap.gov.in. సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది.
తిరుపతి తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
మళ్లీ చెప్తున్నా, రాబోయే కాలాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ శాసిస్తుంది... మన ఆస్తి ఎంత అని కాదు.. మన దగ్గర ఎంత డేటా ఉందని ఆలోచించాలి.. సైన్స్ కు టెక్నాలజీ జోడిస్తే అద్భుతాలు చేయవచ్చు... టెక్నాలజీతో సామాన్య వైద్యులు కూడా అద్భుతంగా ఆపరేషన్ లు చేయవచ్చు అని సూచించారు సీఎం చంద్రబాబు..