YS Jagan Pulivendula Tour: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్.. అనంతరం పులివెందులలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఇక, రేపు ఉదయం 10 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైఎస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. తిరిగి మార్చి 3వ తేదీ సోమవారం రోజు బెంగళూరు నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లికి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Chiranjeevi: అనిల్ రావిపూడి తో మూవీపై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన చిరంజీవి..
కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైసీపీకి ప్రధాని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. గవర్నర్ ప్రసంగం సమయంలోనూ నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలే.. పోడియం వద్దరకు వెళ్లి మరీ నిరసన తెలిపారు.. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.. ఇక, కూటమి ప్రభుత్వానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు.. శాసనమండలికి మాత్రం హాజరై.. ప్రజా సమస్యలపై నిలదీయాలని ఎమ్మెల్సీలకు సూచించిన విషయం విదితమే.