AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. అయితే, ఇవాళ శాసన సభ, శాసన మండలి రెండూ సమావేశం అవుతాయి.. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ సభలో ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగం పై చర్చ జరుగుతుంది.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.. ఇక, శాసన మండలిలో ఏపీ ఎంఆర్డీ సవరణ ఆర్డినెన్స్ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు ప్రసంగిస్తారు.
Read Also: OTT : నెల తిరగకుండానే ఓటీటీలో స్టార్ హీరో సినిమా స్ట్రీమింగ్
నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. అయితే, ఇవాళ నుంచి జరుగుతున్న సమావేశాలను మాత్రమే మొదట రోజు సమావేశాలుగా అసెంబ్లీ రికార్డ్స్ లో. చూపిస్తూన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగానికి వచ్చినా కూడా మొదటి రోజు హాజరైనట్టు లెక్కలోకి రాదు అనే చర్చ జరుగుతోంది. అయితే, అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.. గవర్నర్ ప్రసంగించే రోజు కేవలం సమావేశాలు ప్రారంభమైన రోజు అని.. స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలు ప్రారంభమైన రోజును మొదటి రోజుగా గుర్తిస్తారని ఒక చర్చ జరుగుతోంది.. దీంతో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ప్రసంగానికి రావడం తో మొదటి రోజు అధికారికంగా హాజరైనట్టా. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది..
Read Also: Earthquake : కోల్ కతాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో నమోదు
కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది ఆ పార్టీ.. నిన్న గవర్నర్ ప్రసంగించే సమయంలోనూ దీనిపైనే నినాదాలు చేశారు.. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభను వాకౌట్ చేశారు.. ఇక, ఆ తర్వాత జరిగిన సమావేశంలో.. శాసన సభ సమావేశాలకు హాజరుకావడం లేదని వెల్లడించారు వైఎస్ జగన్.. అయితే, మండలిలో తమకు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. మండలికి మాత్రం హాజరై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు సూచించారు వైఎస్ జగన్..