Nara Lokesh: గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి అని తెలిపారు. ప్రచారానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఓటరును అభ్యర్థించాలి అన్నారు. ఎన్నికల ముందు రోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతి ఓటరు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా పని చేయాలి అని ఆయన చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Read Also: IND vs PAK: పాకిస్తాన్ ఓటమి.. మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ
ఇక, కూటమి అభ్యర్థుల విజయానికి ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. కూటమి నాయకులంతా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి కృషి చేయాలి అన్నారు. అలాగే, ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.