కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నా హామీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టపడి బటన్ నొక్కి అన్ని హామీలు అమలు చేసినా.. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారో తెలపాలి అంటూ వైఎస్ జగన్‌ను నిలదీశారు..
అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాటి ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ప్రేమోన్మాది గణేష్‌ను అరెస్ట్ చేశారు పోలిసులు. నిందితుడు గణేష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
Payyavula Keshav: విశాఖపట్నంలోని రుషికొండ భవన నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. రుషికొండ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండి పడ్డారు.
Illegal Soil Mafia: కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. స్మశానంలో సమాధులు తవ్వుతుంది ఈ మట్టి మాఫియా.. సమాధులతో పాటు ముస్లిం స్మశాన భూమిని తవ్వుకుని వెళ్లి సొమ్ములు చేసుకుంటున్నారు.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం కోర్టులో బెజవాడ పోలీసులు పిటిషన్ దాఖలు వేశారు. సత్య వర్ధన్ నుంచి 164 స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని పోలీసులు పిటిషన్ లో కోరారు.
Vallabhaneni Vamsi Mobile: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండవ రోజు పడమట పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Kakani Govardhan Reddy: అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వంలో ఎకరాకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ. 40 వేల దాకా రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు.
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సబ్ జైల్లో తన భార్తకు ప్రాణహాని ఉందన్నారు.
ASHA Workers: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రి నారా లోకేష్ ని ఆశ వర్కర్లు కలిశారు. ఈ సందర్భంగా, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలఅంటూ మంత్రికి వినతి పత్రం అందించారు. మూడు సంవత్సరాల కాలం పరిమితి సార్కులర్ రద్దు చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి వేతనాలు వ్యక్తిగత అకౌంట్లో వేయాలి అని ఆశా వర్కర్లు కోరారు.
Vallabaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో ఆధారాల సేకరణ నిమిత్తం హైదరాబాద్ కి రెండు పోలీస్ బృందాలు వెళ్లాయి. ఇప్పటికీ వంశీ మొబైల్ ఫోన్ దొరకలేదు.. దీంతో స్థానిక రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.