AP Agriculture Budget: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. 2025 – 26 వార్షిక బడ్జెట్‌తో పాటు.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు.. ప్రకృతి వ్యవసాయం పై దృష్టి పెట్టాం.. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం పై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు.. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు ఉంది.. రాష్ట్రంలో భూమి కలిగిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ఇక, శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ 2025-26 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.. ఈ బడ్జెట్ ద్వారా రైతులకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం..
Read Also: Wife Harassment: భార్య వేధింపులు తట్టుకోలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
వ్యవసాయ బడ్జెట్ – కేటాయింపులు:
* రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
* విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు
* ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు
* ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు
* రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు
* అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు
* ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
* వ్యవసాయ శాఖకు రూ.12,401.58 కోట్లు
* ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు
* పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు
* సహకార శాఖకు రూ.239.85 కోట్లు
* పశుసంవర్ధక శాఖకు రూ.1,112.07 కోట్లు
* మత్స్య రంగానికి రూ.540.19 కోట్లు
* ఎన్జీ రంగా వర్సిటీకి రూ.507.01 కోట్లు
* వైఎస్సార్ వర్సిటీకి రూ.98.21 కోట్లు
* ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి రూ.154.57 కోట్లు
* ఏపీ ఫిషరీస్ వర్సిటీకి రూ.38 కోట్లు
* ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773.25 కోట్లు
* ఉపాధి హామీకి రూ.6,026.87 కోట్లు
* ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు
* నీటివనరుల శాఖకు రూ.12,903.41 కోట్లు..