Posani Krishna Murali Case: పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, పోసాని కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఐటీ యాక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది.. పోసానిపై త్రిబుల్ వన్ కేసు పెట్టడానికి వీలులేదన్నారు.. వర్గ వైశమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్లు వల్లే రిమాండ్ ఉంటుంది.. ఐదు సంవత్సరాలలోపు శిక్షపడే కేసులకు రిమాండ్‌కు పంపాల్సిన అవసరం లేదన్నారు.. సుప్రీంకోర్టు జడ్జి ఆగ్నేష్ కుమార్ తీర్పు ప్రకారం రిమాండ్ కు పంపాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించాం.. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్.. స్టేట్ స్పాన్సెడ్ కేసు ఇది అని వ్యాఖ్యానించారు.. అన్ని వ్యవస్థలను స్టేట్ గుప్పెట్లో పెట్టుకుంది.. మా పోరాటం కొనసాగుతుందన్నారు..
Read Also: Pune Rape Case: నిందితుడు చివరికిలా చిక్కాడు! అదే పట్టించింది
కాగా, పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. అయితే, తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజంపేట సబ్ జైలుకు తరలించాలని రైల్వే కోడూరు జడ్జి ఆదేశించడంతో.. రాజంపేట సబ్ జైలుకు పోసాని కృష్ణ మురళి తరలించారు.. పోసానికి 2261 నెంబర్ కేటాయించారు జైలు అధికారులు..