విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేసింది ఏపీ ఈఆర్సీ.. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్.. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్‌లను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఛైర్మన్ ఈ రోజు తిరుపతిలో విడుదల చేశారు..
ప్రధాని మోడీ – పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికర చర్చ.. ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..? ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ…
ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు..
ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు పవన్.. వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకి హాజరుకాలేకపోయానన్న ఆయన.. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీని వైఎస్ జగన్ అప్పుల కుప్పగా మార్చారు.. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.. పర్యావరణ, అటవీ శాఖలు నాకు…
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరయ్యారు.. ఇక, ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఆసక్తికర చర్చ సాగింది.. మొత్తానికి పవన్…
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు చేశారు గుంటూరులో పోలీసులు.. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే కాగా.. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు..
తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే... ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో... జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే... అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు.
వల్లభనేని వంశీ.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా రెండుసార్లు బీఫామ్స్ తీసుకున్నారాయన. ఎంపీగా ఓడినా గన్నవరం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇక 2019లో టీడీపీ తరపునే గెలిచిన వంశీ నాడు అధికారంలోకి వచ్చిన వైసీపీకి జైకొట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భద్రతా వైఫల్యంపై రేపు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నజీర్‌ను.. కలవనుంది వైసీపీ నేతల బృందం. జగన్‌కు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు.