తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది..
టీటీడీ పాలకమండలి సభ్యుడు.. ఉద్యోగి మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. మూడు రోజులు క్రితం మహాద్వారం గేటు తెరిచే అంశంపై పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్... టీటీడీ ఉద్యోగి బాలాజీ మధ్య తలెత్తిన వివాదానికి ఉద్యోగ సంఘ నేతలు ముగింపు పలికారు.
గుంటూరులో ఉచితంగా చికెన్ పంపిణీ చేశారు పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు.. బర్డ్ ఫ్లూ వదంతులతో పడిపోయిన చికెన్ అమ్మకాలను తిరిగి పుంజుకునేలా చేసేందుకు సిద్ధమయ్యారు.. నష్టాల పాలైన నేపథ్యంలో, పౌల్ట్రీ పరిశ్రమకు మద్దతుగా రంగంలోకి దిగి చికెన్ తినాలంటున్న ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు..
మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు.
పెట్రో ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. విజయవాడలో కేంద్ర బడ్జెట్ అవగాహన సమావేశానికి హాజరైన ఆయన.. ముందుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో కలిసానన్నారు.. ట్రంప్ తన మార్క్ చూపించాలనుకున్నాడున్నారు.. అలాగే పెట్రోలియం రేట్లు మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో తగ్గాయన్నారు.. ఢిల్లీలో బీజేపీ సర్కార్ వచ్చింది.. బీహార్ లో కూడా…
కూటమి ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.. అనధికారికంగా కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించారు.. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తల ఫోన్ నంబర్స్ ఇటీవల కలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. ట్యాప్ చేస్తున్నారనే టీడీపీ లీడర్స్ ని కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నరట్టు చెప్పుకొచ్చారు..
విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్‌లో కలిశారు ఆయన భార్య పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. వంశీని కలిశాం.. కింద పడుకోవడం కొంచం ఇబ్బందిగా ఉంది.. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించామని రిక్వస్ట్ చేశామని తెలిపారు పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసింకంగా ఆనంద పరచడం కోసం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు..
రేపు మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం... ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలు ఉండగా.. 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి.
వైఎస్ జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో... జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు..