YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి మృతి.. కడప ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
- వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి..
- రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు..
- వివేకా కేసులో వరుస మృతులపై ఎస్పీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంపై అనుమానం వ్యక్తం చేశారు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. కీలక సాక్షిగా ఉన్న రంగన్న నిన్న సాయంత్రం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంగన్న భార్య సుశీల తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేయడం.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే, ఇటీవల కేసులో సాక్షిగా వైఎస్ అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయయని.. వీటిపై లోతుగా దర్యాప్తు చేపడతాం అంటూ ఎస్పీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు, వైఎస్ వివేకా కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్.
Read Also: Off The Record: కొత్త ఇంఛార్జ్‌కి ఆ కాంగ్రెస్ నేతపై మూకుమ్మడిగా ఫిర్యాదులు..?
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాం అన్నారు ఎస్పీ అశోక్ కుమార్.. వివేకా హత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు మృత్యువాత పడుతున్నారు… వివేకా హత్య కేసులో వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు… అందుకోసం రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశాం… రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నాం… సాక్షులు మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయి అన్నారు.. అసలు ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. సాక్షుల మృతి వెనక పోలీస్, సీబీఐ ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. వివేకా హత్య కేసులు సాక్షిగా ఉన్న ఆరుగురు మృతిపైన అనుమానాలు ఉన్నాయి… శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ, శంకర్ రెడ్డి, వాచ్‌మెన్ రంగన్న.. ఇలా ఆరుగురు వివేకా హత్య కేసులో సాక్షులు.. రంగన్న మృతిలో హై ప్రొఫెషనల్ మర్డర్ గా అనుమానం ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!